పోలవరం ప్రాజెక్టు జాప్యానికి చంద్రబాబే కారణం అని మరోసారి ఆరోపించారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు.. శ్రీశైలం ప్రాజెక్టులో నీరు గరిష్టస్థాయికి చేరడంతో.. గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేసిన ఆయన.. ఈ సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు.. పోలవరం డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడం టీడీపీ ప్రభుత్వం చేసిన చారిత్రాత్మక తప్పిదం అన్నారు.. కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ ఎవరైనా నిర్మిస్తారా..? అని నిలదీసిన ఆయన.. నిపుణులతో చర్చకు రెడీ, టీవీలో చర్చకు వస్తారా..? అంటూ టీడీపీ నేతలకు బహిరంగ సవాల్ విసిరారు అంబటి రాంబాబు. నిపుణులు చెప్తున్నది కాఫర్ డ్యామ్ పూర్తయిన తర్వాతే డయాఫ్రమ్ నిర్మించాలనే.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే కాఫర్ డ్యామ్ పూర్తి చేశామని గుర్తుచేశారు.
Read Also: Srisailam Dam Gates Lifted: శ్రీశైలంలో అద్భుత దృశ్యం.. ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత..
చంద్రబాబు అహంతోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగిందన్నారు అంబటి రాంబాబు.. ఇక, గోదావరి వరద బాధిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటనపై విమర్శలు గుప్పించారు… గోదావరి వరద బాధితులతో చంద్రబాబు టీడీపీ జెండాలతో వెళ్తారా… సిగ్గుచేటు అంటూ ఎద్దేవా చేశారు.. వరద బాధితులతో మాట్లాడేందుకు వెళ్లారా.. లేక, ఎన్నికల ప్రచారానికి వెళ్లారా? అని ప్రశ్నించారు.. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై బురద చల్లేందుకే చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. నదుల్లో నీల్లు ఫుల్ గా ఉన్నాయి.. అన్ని ప్రాజెక్టులు నిండుతాయని తెలిపారు.. వరదలు ఈ ఏడాది చాలా ముందుగా వచ్చాయని పేర్కొన్నారు మంత్రి అంబటి రాంబాబు.. కాగా, తుంగభద్ర, కృష్ణా నది నుంచి వరద కొనసాగుతుండడంతో.. ఈ సారి వేగంగా నిండింది శ్రీశైలం ప్రాజెక్టు.. జులై నెలలోనే పూర్తిస్థాయిలో ప్రాజెక్టు నిండింది.. శ్రీశైలం డ్యామ్ 3 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు.. ప్రస్తుతం ఇన్ ఫ్లో 1,12,298 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 1,39,607 క్యూసెక్కులుగా ఉంది..