Ambati Rambabu: పోలవరం ఆలస్యానికి టీడీపీయే కారణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉద్దేశ్య పూర్వకంగా పోలవరం ప్రాజెక్ట్‌కి వైసీపీ అడ్డంకి అని చంద్రబాబు కేంద్ర జలవనరుల శాఖకి లేఖ రాశారని మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. మొగుణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కినట్టు బాబు వైఖరి ఉందని దుయ్యబట్టారు. టీడీపీ అలసత్వం వల్లనే పోలవరం పూర్తి కాలేదు. ట్రాన్‌స్ట్రాయ్ ని తీసేసి నవయుగకి పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చింది బాబు. చంద్రబాబు రాసిన లేఖను కేంద్రం చూడను కూడా చూడదు చెత్త బుట్టలో వేస్తారన్నారు.పోలవరం కుంటుపడింది అని చెప్పాలనే ఉద్దేశ్యంతో ఈ లెటర్ రాసారు. పోలవరం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ప్రాజెక్ట్ అన్నారు అంబటి రాంబాబు.
పోలవరం ప్రాజెక్ట్‌లో కీలకమైన స్పిల్ వే, ఇతర పనులు పూర్తి చెయ్యలేదు.డయాఫ్రమ్ వాల్ దెబ్బ తినడానికి కారణం చంద్రబాబు, దేవినేని ఉమ వైఖరి. వుందన్నారు. డయాఫ్రమ్ వాల్ ఎంతవరకు దెబ్బతిందో కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. అసెంబ్లీలో పోలవరం పై చర్చ జరుపుదాం. శాసనసభ సాక్షిగా డయాఫ్రామ్ వాల్ ఎలా కొట్టుకుపోయింది చర్చిద్దాం అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి అవుతుందో త్వరలోనే శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. మూడేళ్లలో 95 శాతం హామీలను నెరవేర్చిన ఏకైక సీఎం వైయస్ జగన్ అని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నింటినీ నెరవేర్చి జనంలోకి వెళ్తున్నామన్నారు. భవిష్యత్ ప్రణాళికపై చర్చించేందుకే ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తున్నామని మంత్రి అంబటి చెప్పారు.
Also Read
- Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
- AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
- APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
- CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
దుష్టచతుష్టయం ఎన్ని కుట్రలు చేసినా ఫలితం ఉండదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు మోసాలు తప్ప త్యాగాలు చేయలేదని ధ్వజమెత్తారు. ఎవరినో సీఎంను చేసేందుకు పెట్టిన పార్టీ జనసేన అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎంతమందిని కలుపుకొచ్చినా ఎన్నికల్లో భంగపాటు తప్పదని, సంక్షేమ సైనికుల అండతో మళ్లీ అధికారంలోకి రాబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు మంత్రి అంబటి రాంబాబు.
తాజావార్తలు
-
BCCI Chief Selector: కొత్త శకం మొదలు.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా దిగ్గజ స్పిన్నర్!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
-
Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
-
Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?