ఏపీలో వైసీపీ నేతలు వర్సెస్ టీడీపీ నేతలకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అధికార వైసీపీ ప్రభుత్వంపై ప్రధాన విపక్ష పార్టీ టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తుంటే.. అదే రేంజ్ లో అధికార వైసీపీ నేతలు ప్రశ్నలు వేస్తున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. సీఎంగా వైఎస్ జగన్ వచ్చిన దగ్గర నుంచి స్పెషల్ ఫోర్స్ పెట్టి క్లబ్ లు మూయించిన మాట వాస్తవం కాదా అని టీడీపీ నేతలను ప్రశ్నించారు. టీడీపీ…
కరోనా రక్కసి ఎవ్వరినీ వదలడం లేదు. ఇప్పటికే కరోనా సోకి కోలుకున్న వారు సైతం కరోనా బారినపడుతున్నారు. ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చిన తరువాత కరోనా కేసుల సంఖ్యం దేశవ్యాప్తంగా పెరుతూవస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ లాక్డౌన్లు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో కూడా ఈ నెల 18 నుంచి నైట్ కర్ఫ్యూ విధించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే తెలుగువారికి ప్రత్యేకమైన సంక్రాంతి పండుగను పురస్కరించికొని నైట్ కర్ఫ్యూను 18వ తేదీ నుంచి పెడుతున్నట్లు…
ప్రతిపక్షాలపై వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..ఇది వైసీపీకి అభివృద్ధి, సంక్షేమ నామ సంవత్సరమని, బీజేపీకి మద్యపాన సంవత్సరమని, జనసేనకు ప్యాకేజీ నామ సంవత్సరం అని మొత్తంగా విపక్షాలకు ఏడుపునామ సంవత్సరమని అంబటి వ్యాఖ్యానించారు. అమరావతి ఇక్కడే ఉంటుందన్నారు. బీజేపీ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. బీజేపీ పార్టీనా జూదం పార్టీనా? జిన్నా టవర్ను పేల్చేస్తామని బీజేపీ నేతలు అంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో బుద్ధుడి విగ్రహాన్ని…
మూడేళ్లలో 1.50 లక్షల కోట్లను సంక్షేమం కోసం జగన్ సర్కార్ వెచ్చించిందని… చంద్రబాబు హయాంలో క్రైస్తవులపై దాడులు జరిగాయని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే అంబటి రాంబాబు. గుంటూరు జిల్లాలో దళితులపై దాడి జరగలేదని…కులాలు వర్గాల మధ్య చిచ్చుపెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఓటీఎస్ వల్ల ప్రజలకు అనేక లాభాలు ఉన్నాయని… ఓటీఎస్ పై తెదేపా దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు మాటల్ని ప్రజలు ఎవరూ విశ్వ సించడం లేదని.. తన హయాంలో ఇళ్ల రుణాలను ఎందుకు…
పవన్ కళ్యాణ్ పై అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. అమరావతి ఒకటే రాజధాని కావాలని అంటున్నాడు పవన్ కళ్యాణ్. కానీ గతంలో చెప్పిన మాటలు మర్చిపోయావా అని ప్రశ్నించారు. జనసేనను అధికారంలోకి తీసుకుని రావాలని అడిగే హక్కు ఉందా అని అడిగిన ఆయన విశాఖ ఉక్కుపై కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే ధైర్యం లేదా అన్నారు. విశాఖ ఉక్కు కేంద్ర ప్రభుత్వ ఆస్తి. అయినా ఇలా అమ్మటం అన్యాయం అని అవకాశం ఉన్న ప్రతి సందర్భంలోనూ చెబుతూనే ఉన్నాం.…
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కౌంటర్ వేశారు. ప్రత్యేక హోదాను వెయ్యి అడుగుల గొయ్యి తీసి పాతి పెట్టారు చంద్రబాబు. బీజేపీతో పార్ట్ నర్ గా ఉండి ప్రైవేటీకరణకు ఏది ఇచ్చినా ఆవు కథ వ్యాసం రాసే వారిలా ఉంది పవన్ కళ్యాణ్ వైఖరి. విశాఖ ఉక్కు గురించి దీక్ష చేస్తున్న అన్న పవన్ కళ్యాణ్ ఉపన్యాసం లో ఎక్కడా విశాఖ ఉక్కు ప్రస్తావనే లేదు. ఉపన్యాసం అంతా జగన్ కు 151…
భారీవర్షాలతో ఏపీలో పలు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తిరుపతిలో సైతం మునపెన్నడూ చూడనివిధంగా వరదలు పోటెత్తాయి. అయితే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇటీవల సీఎం జగన్ పర్యటించారు. అంతేకాకుండా బాధితులు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత సీఎం జగన్పై పలు విమర్శలు చేశారు. దీంతో చంద్రబాబు మాటలకు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. భారీ వర్షాలతో సంభవించిన వరదలను మానవ తప్పిదంగా చూపించాలని చంద్రబాబు తాపత్రయ పడుతున్నారని, అందుకే…
ఇటీవల ఏపీలో కురిసిన భారీ వర్షాలతో పలు జిల్లాల్లో వరదలు సంభవించాయి. అయితే వర్షాల కారణంగా భారీ వరద రావడంతో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. దీంతో వరదలు సంభవించి ప్రాణ, ఆస్తి నష్టం చోటు చేసుకుంది. అయితే వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించి వరద బాధితులకు అండగా ప్రభుత్వం ఉంటుందని అలాగే పలు వరాల జల్లులను కురిపించారు. ఆ తరువాత టీడీపీ నేతలు జగన్ పర్యటపై పలు విమర్శలు చేశారు. దీనిపై స్పందించిన వైసీపీ…