విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. సభలో పాల్గొన్న పవన్ ఉక్కు పరిరక్షణ సమితికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్.. కేంద్రానికి ఇక్కడి సమస్యలు తెలియకుండా చేస్తున్నారని, ఇక్కడి మంత్రులు వెళ్లి కేంద్రానికి సమస్యలు వెల్లడించకుంటే కేంద్రానికి సమస్యలు ఎలా తెలుస్తాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇక్కడి సమస్యలు కేంద్రానికి తెలియాలంటే…
జనం కొడతారని పారిపోయి ఢిల్లీ పారిపోయిన వ్యక్తి రఘురామ కృష్ణంరాజు అని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. నీచమైన పనులు చేసే వ్యక్తిని చంద్రబాబు వెనకేసుకు వస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుని పోతుంటే కుట్రదారులందరూ రంగంలోకి దిగారు అని తెలిపారు. ఢిల్లీలో కూర్చుని చంద్రబాబు కోసం లాబీయింగ్ చేస్తున్నాడు. చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతున్నారు అని పేర్కొన్నారు. జైలుకు వెళ్ళకుండా డైరెక్ట్ గా హాస్పిటల్ కు వెళ్ళాలని, పోలీసుల పై…