ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తోంది వైసీపీ. మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. రాబోయే ఎన్నికల గురించే చర్చ సాగుతోంది. విపక్షాలపై విరచుకుపడుతూ వైసీపీ నేతలు ప్లీనరీలో హాట్ కామెంట్స్ చేస్తున్నారు. విజయవాడలో సెంట్రల్ నియోజకవర్గ ప్లీనరీ సమావేశం హాట్ హాట్ గా సాగింది. పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేసిన ఘనత సీఎం జగన్ కి దక్కుతుందన్నారు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. విద్య కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందన్నారు.
కరోనా సమయంలో జగన్ లాంటి సీఎం లేకపోతే పరిస్థితి దారుణంగా వుండేది. విజయవాడ సెంట్రల్ లో కరోనా సమయంలో అనేక సేవలు అందించాం. 2024 లో వైకాపా కు కంచుకోటగా సెంట్రల్ నియోజకవర్గం వుంటుందన్నారు. ఏ రాజకీయ పార్టీకి నవరత్నాలతో పోటీపడే ఛాన్స్ లేదు. ప్లీనరీ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, మంత్రి అంబటి రాంబాబు, హోంమంత్రి తానేటి వనిత, ఎమ్మెల్సీ మాణిక్య వరప్రసాద్, మేయర్, డిప్యూటీ మేయర్, హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణు దే విజయం… వంగవీటి రాధా వచ్చిన ఎవరు వచ్చిన వైసీదే విజయం అన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.
పవన్ ఊడిగం చేస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో 175 కి 175 సీట్లు వైసీపీకే సొంతం అవుతాయన్నారు. ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గల్లో ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు వివరించటానికి గడప గడపకి వెళ్తున్నాం. టిడిపి కి, పవన్ కళ్యాణ్ కు ఓటు వేసిన వారి ఇంటికి వెళ్ళి సంక్షేమ పథకాలు వివరిస్తున్నాము. గ్లాసు కు ఓటు వేసిన నాకు కాపు నేస్తం వచ్చింది అని చెప్తున్నారు. సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందుతున్నాయన్నారు.
జగన్ ను సింగిల్ గా ఎదుర్కొనే సత్తా చంద్రబాబుకు లేదు. అయ్యన్న పాత్రునికి నోరు విప్పితే బూతులే. ఎన్ని జన్మలెత్తిన చంద్రబాబు సీఎం కాలేడు. చంద్రబాబు కు జై కొట్టే వాళ్ళు ఇద్దరే… లోకేష్, అతని దత్త పుత్రుడు పవన్ అని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో పవన్ తో వస్తవో ఎవరితో వస్తావో.. రా…. కట్టకట్టి కృష్ణ నదిలో కలిపేస్తాం. రాష్ట్రంలో పవన్ కు సీఎం అయ్యే ఛాన్స్ లేదు. ఎవరు ఎవరితో కలిసి వచ్చినా వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయం అన్నారు.
LIVE : శివసేనకు షాక్..! ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమవుతున్న బీజేపీ..?