జూలై 8,9 తేదీల్లో రాష్ట్ర స్థాయిలో వైసీపీ ప్లీనరీ సమావేశం నిర్వహించబోతున్నామని మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. ఈ సందర్భంగా గత మూడేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఎలాంటి పథకాలు అమలు చేసిందో ప్రజలకు వైసీపీ నేతలు వివరించాలని ఆయన సూచించారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని ఆయన స్పష్టం చేశారు. అటు పవన్ కళ్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ ఓట్లు చీలనివ్వనంటాడు.. బీజేపీతో పొత్తులో ఉన్నామంటారు.. ఒకసారి మూడు…
ఏపీలో రాజకీయ విమర్శల వేడి రాజుకుంటూనే వుంది. మంత్రులు టీడీపీ నేతలపై తమదైన రీతిలో మండిపడుతూనే వున్నారు. తాజాగా ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు మాటలు చూస్తుంటే జాలేస్తోంది. ముఖ్యమంత్రిని తీవ్రవాదిలాగా తయారు అయ్యారంటారు. క్విట్ జగన్ అంటాడు. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడి మాటలేనా అవి?? ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నారు మంత్రి అంబటి రాంబాబు. బొబ్బిలి సినిమా గుర్తుకు తెచ్చుకుని ఆవేశం తెచ్చుకోండి అంటున్నాడు…
ఏపీ రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. శుక్రవారం మధ్యాహ్నం కృష్ణా డెల్టాకు ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు సాగునీరు విడుదల చేశారు. కృష్ణా తూర్పు డెల్టాకు 1500 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 500 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జోగి రమేష్, మేరుగ నాగార్జున, విప్ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, సింహాద్రి రమేష్, ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ పాల్గొన్నారు. కృష్ణా డెల్టా చరిత్రలో ముందుగానే సాగునీటిని…
ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబుపై మండిపడ్డారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. అంబటి ఇప్పుడు వైసీపీ అధికార ప్రతినిధి కాదు.. మంత్రి అనే విషయాన్ని గుర్తించాలి. ఆయన చిప్ పనిచేయడం లేదేమో. ఆత్మకూరులో రాజకీయం కోసం.. ఓట్ల కోసం ఇన్‌ఛార్జులుగా మండలానికో మంత్రిని ఇన్ఛార్జీగా వైసీపీ నియమించింది. అలా ఇన్‌ఛార్జులుగా వేసిన మంత్రులను వెంబడిస్తానని నేను అన్నాను. దానికి విపరీతార్దాలు మంత్రి అంబటి విపరీతార్ధాలు తీశారు.రాష్ట్రానికి వచ్చే కేంద్ర మంత్రులను తామూ వెెంబడిస్తామని అంబటి…
సోషల్ మీడియాలో మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించి అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శలు చేశారు. ఫేక్ ట్వీట్‌పై తాను సీఐడీకి ఫిర్యాదు చేస్తే.. సోది రాంబాబు సోది మాటలు మాట్లాడుతున్నాడంటూ ఫైర్ అయ్యారు. తాను ఫాల్స్ కంప్లైంట్ చేశానంటూ ఏదేదో మాట్లాడుతున్నాడని.. ఫేక్ ట్వీట్‌ను ఆయన తనను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేయడం…
ఏపీలో ఒకవైపు ట్వీట్ల యుద్ధం నడుస్తుంటే… మరోవైపు ఫేక్ ట్వీట్ల రగడ రాజకుంటోంది.ఇంతకుముందు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యల పేరుతో ట్వీట్లు వైరల్ అయ్యాయి. తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమా పేరుతో మరో ట్వీట్ వైరల్ అయ్యింది. దీనిపై ఆయన స్పందించారు. తన పేరుతో నకిలీ ట్వీట్ సృష్టించి ప్రచారంలో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉమా. అలాంటి ట్వీట్లు తాను ఎలా పెడతానని ఉమా ప్రశ్నించారు. ఈ…
ఏపీలో మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమాల మధ్య వార్ కొనసాగుతోంది. పొత్తులపై పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తూ తాను ట్వీట్ చేసి డిలీట్ చేశానన్న మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై దేవినేని ఉమ కౌంటర్ ఇచ్చారు. జగన్ ప్రభుత్వమే స్వయంగా ఫేక్ ట్వీట్లను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. సీఎం జగన్‌కు తెలిసే సజ్జల డైరెక్షన్లో ఫేక్ ప్రచారం జరుగుతోందని దేవినేని ఉమ ఆరోపించారు. కులాల మధ్య, పార్టీల మధ్య వైషమ్యాలు పెంచేందుకు ప్రభుత్వమే ఫేక్ ప్రచారానికి…
పోలవరం ప్రాజెక్టు విషయంలో కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా, మంత్రి అంబటి రాంబాబు మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా మాజీ మంత్రి దేవినేని ఉమ ఓ ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్ పార్టీ పరంగా వివాదాస్పదం కావడంతో దేవినేని ఉమా వెంటనే దానిని డిలీట్ చేశారు. అయితే ఈ విషయాన్ని మంత్రి అంబటి రాంబాబు పసిగట్టేశారు.…
పోలవరం ప్రాజెక్ట్ పై మంత్రి అంబటి రాంబాబు సరైన సమాధానం చెప్పడం లేదని, చెప్పేదంతా తప్పుల తడకగా ఉందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. డయా ఫ్రమ్ వాల్ ను చంద్రబాబు కడితే దానిని ఏమి చేయాలో తెలియక అయోమయ పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం ఉంది. ప్రాజెక్ట్ పై ఎందుకు నిపుణులతో పరిశీలన చేయడం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మీరు ఒక కాంట్రాక్టర్ ను పెట్టుకున్నారు. గతంలో ప్రభుత్వం ఒక కాంట్రాక్టర్ ను పెట్టుకుంది.…