ఏపీలో పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ వైసీపీ నేతలు మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. పోలవరం ప్రొజెక్ట్ విషయంలో వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది.కాని అప్పటి టిడిపి ప్రభుత్వం కు చిత్తశుద్ధి లేదన్నారు ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు. తాను మూడు ప్రశ్నలు టీడీపీకి వేస్తున్నా అన్నారు. పోలవరం ప్రొజెక్ట్ ను కేంద్రం నిర్మిస్తానంటే…ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. 2018కి పూర్తి చేస్తామని చెప్పి ఎందుకు పూర్తి చేయలేదు. వాళ్లు చేయలేకపోవటానికి , ఈరోజు స్లోగా పనులు జరగటానికి కారణం డయాఫ్రం వాల్ అన్నారాయన.
Read Also: Buddha Venkanna: పరామర్శ జగన్ పేటెంట్ హక్కు కాదు
కాపర్ డ్యాంల నిర్మాణం లేకుండా డయాఫ్రం వాల్ ఎందుకు నిర్మించారు? ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. డయాఫ్రం వాల్ దెబ్బతిన్న అంశంపై పలు సందేహాలు ఉన్నాయన్నారు. అగాధాలు లోపల ఉన్నాయి. వరదల కారణంగా లోయర్ కాపర్ డ్యాం పనులు జరగలేదు. పోలవరం పూర్తి కాకపోవటానాకి చంద్రబాబు కారణం అని ఆయన ఆరోపించారు. చంద్రబాబు నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మాట్లాడం సరైంది కాదన్నారు అంబటి రాంబాబు. ఇదిలా వుంటే పోలవరం ముంపు ప్రాంతాల్లో జనం అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ప్రభుత్వం నుంచి నాణ్యమయిన సాయం అందడం లేదని బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వం అందించే నిత్యావసరాలైన కూరగాయలు కుళ్లి వున్నాయని వారు ఆవేదన చెందుతున్నారు.
Read Also: KTR On Bandi Sanjay: అమిత్ షాకు ఉరికి ఉరికి చెప్పులు తొడగడం తెలంగాణ ఆత్మగౌరవమా ?