YSRCP: విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి జగన్ ప్రభుత్వం పేరు మార్చడంపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అయితే బాలయ్యకు వరుసగా మంత్రులందరూ కౌంటర్లు ఇస్తున్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా మంత్రులు ట్వీట్లు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు ఎప్పుడు పెట్టారో చెప్పాలని బాలయ్యను మంత్రి మేరుగ నాగార్జున ప్రశ్నించారు. మీరంతా కలిసి చంపేశాకే కదా.. చేసిన పాపం పేరు పెడితే పోతుందా అంటూ నిలదీశారు. టీడీపీ హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టకపోయినా హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు ఎలా పెట్టుకున్నారని సూటి ప్రశ్న వేశారు.


అటు మంత్రి గుడివాడ అమర్నాథ్ తనదైన శైలిలో ట్వీట్ చేశారు. అఖండ సినిమాలోని డైలాగ్ పోస్టర్‌తో ఎన్టీఆర్ మీద చంద్రబాబు చెప్పులు వేయిస్తే.. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి జగన్ పూలు వేయించారని.. బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ గుడివాడ అమర్నాథ్ ట్వీట్ చేశారు. వెన్నుపోటు పొడిచిన వారంతా ఎన్టీఆర్ భక్తులమని చెబుతున్నారని.. జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన జగన్‌పై బురద జల్లుతున్నారని.. ఎంత గొప్ప మనుషులురా మీరు అంటూ మంత్రి అప్పలరాజు ట్వీట్ చేశారు. జోరు తగ్గించవయ్యా.. జోకర్ బాలయ్య అంటూ మంత్రి అంబటి రాంబాబు సెటైర్ వేశారు. ఏపీలో నాన్ టీడీపీ హయాంలో 8, వైఎస్ఆర్ హయాంలో 3, జగన్ హయాంలో 17 మెడికల్ కాలేజీలు వచ్చాయని.. మరి ఎన్టీఆర్ ఎక్కడి నుంచి వచ్చారని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ప్రశ్నించారు. ఇంతకీ వైద్య రంగానికి టీడీపీ చేసిన గొప్ప మేలు ఏంటన్నారు. వైఎస్ఆర్, వైఎస్ జగన్ చేయని మేలు ఏంటో చెప్పాలన్నారు.
Both are not same…
ఎన్టీఆర్ మీద బాబు చెప్పులు వేయిస్తే
కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి పూలు వేయించారు జగన్ pic.twitter.com/zAiGZdvH9G
— Gudivada Amarnath (@gudivadaamar) September 24, 2022
ప్రభుత్వ ఆస్పత్రులను పిల్లలను ఎలుకలు కొరికే ఆస్పత్రులుగా.. సెల్‌ఫోన్ లైట్లలో ఆపరేషన్‌లు చేసే ఆస్పత్రులుగా మార్చిన మీ ఎల్లో గ్యాంగ్.. అయినా మెడికల్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరే ఉండాలనుకోవడం.. ఇది కరెక్టేనా అంటూ మంత్రి విడదల రజినీ ట్వీట్ చేశారు. ప్రజల హెల్త్ అంటే మీకు ఎందుకు చులకన అని ప్రశ్నించారు. 104, 108 వాహనాలను పాడుపెట్టి ఆరోగ్యశ్రీని చంపేసి హెల్త్ యూనివర్సిటీకి మాత్రం ఎన్టీఆర్ పేరు ఉంచాలని ఉద్యమాలు చేస్తారా అంటూ నిలదీశారు.
బాలకృష్ణా…
ప్రజల హెల్త్ అంటే మీకు ఎంత చులకన?!. 104, 108 వాహనాలను పాడు పెట్టి, ఆరోగ్యశ్రీని చంపేసి హెల్త్ యూనివర్సిటీకి మాత్రం ఎన్టీఆర్ పేరు ఉంచాలని ఉద్యమాలు చేస్తారా.?— Rajini Vidadala (@VidadalaRajini) September 24, 2022