Ambati Rambabu: కుప్పం చేతిలోంచి జారిపోతుందని చంద్రబాబుకు భయం పట్టుకుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: కుప్పం తన చేతిలోంచి జారిపోతుందని చంద్రబాబుకు భయం పట్టుకున్నట్లు ఉందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. 33 ఏళ్లుగా కుప్పం శాసనసభ్యుడిగా ఉన్న ఆయన.. ఈ మధ్యే కుప్పం వెళ్తున్నారని ఆయన అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కుప్పంలో చంద్రబాబుకి గెలుపే లేదన్నారు. మున్సిపల్, జిల్లా పరిషత్, సర్పంచ్.. ఏ ఎన్నికలో అయినా డిపాజిట్లు రాలేదన్నారు. 33 ఏళ్లు నిన్ను మోసిన కుప్పానికి నువ్వు ఏమి చేసావు అంటూ చంద్రబాబును ఉద్దేశించి ప్రశ్నించారు. గాలేరు నగరికి జగన్ నిధులు ఇవ్వలేదట…నువ్వేమి చేశావ్?.. కనీసం కుప్పం కెనాల్ కూడా పూర్తి చేసుకోలేక పోయావంటూ ఆరోపించారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న వ్యక్తి వైఎస్ జగన్ అంటూ అంబటి రాంబాబు పేర్కొన్నారు. కుప్పంలో కూడా పార్టీ, ప్రాంతం అనేది లేకుండా సంక్షేమ ఫలాలు అందించారని అన్నారు. అక్కడి ప్రజలు ఇప్పుడు తమ వాణిని వినిస్తున్నారన్నారు.
Chandrababu Kuppam Tour: కుప్పానికి నీళ్లివ్వని ముఖ్యమంత్రి చరిత్రహీనుడిగా మిగిలిపోతారు..
Also Read
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
లోకల్ బాడీ ఎన్నికల్లో వంగి నమస్కారం పెట్టినా ఫలితం లేదని మంత్రి ఎద్దేవా చేశారు. అవసరం కోసం చంద్రబాబు చంద్రగిరి నుంచి కుప్పం వెళ్లారని ఆయన అన్నారు. కనీసం ఈ 33 ఏళ్లలో కనీసం ఇల్లు కూడా అద్దెకు తీసుకోలేదన్నారు. కుప్పం ప్రజల గళాన్ని విని బెంబేలెత్తి పర్యటనలు చేస్తున్నారని.. కుప్పం కూలే పరిస్థితి వచ్చిందని.. ఇది వాస్తవమన్నారు. వైసీపీ కార్యకర్తలు వారి ఇళ్లపై జెండాలు కట్టుకుంటే ఏమిటి మీ బాధ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరొస్తుంటే వైఎస్సార్సీపీ కార్యకర్తలు కూడా మీకు స్వాగతం పలకాలా…? జెండాలు పీకేసుకోవాలా..? అంటూ ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి వైసీపీ జెండాలను పీకించి దౌర్జన్యం చేస్తారా అంటూ మండిపడ్డారు. టీడీపీ నేతలు ఆ చర్యలకు పాల్పడ్డారు కాబట్టే వైసీ నాయకులు రియాక్ట్ అయ్యారని చెప్పుకొచ్చారు. ఈ సంఘటనతో సానుభూతి పొందాలని ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని చంద్రబాబు వ్యాఖ్యలపై అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరిది ఆరిపోయే దీపం చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. అధికారంలోకి రావడానికి ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచినంత సులభం కాదన్నారు. 175 సీట్లు గెలుస్తాం అన్నా మాట ఇప్పుడు మీకు అర్దం అవుతుందా చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. ఈ మూడు రోజులు చంద్రబాబు బాడీ లాంగ్వేజ్ చూస్తే అర్దం అవుతుందన్నారు. కుప్పం జారిపోతుంది…కూలిపోతుంది అనే ఆవేదన ఆయనలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
తాజావార్తలు
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!