పోలవరం ప్రాజెక్టుపై ఏపీలో అధికార వైసీపీ-టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. తాజాగా మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ ఏ మేరకు దెబ్బ తిన్నదో ఇంకా నిర్దారించ లేదు. డయాఫ్రమ్ వాల్ ఏ మేరకు దెబ్బతిన్నది అనేది నిర్దారించడానికి సమయం పడుతుంది డయాఫ్రమ్ వాల్ దెబ్బ తినడంపై నిర్ధారణ వచ్చేంత వరకు పోలవరం ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణం జరగదు.నేషనల్ హైడ్రో పవర్ కార్పోరేషన్ సంస్ధ నిర్దారణ చేయడానికి సమయం పడుతుందని చెప్పిందన్నారు.
Read Also: Amit Shah Meets Jr NTR : నిన్నటి వరకు పవన్ పేరు..ఇప్పుడు జూ.ఎన్టీఆర్ పేరు..కారణమేంటి.?
పోలవరం సహా ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాకూడదని టీడీపీ కోరుకుంటోంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకూడదని టీడీపీ నేతలు కోనసీమలో ఉన్న కొబ్బరి కాయలు కొడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు అయితే మేమే నిర్మిస్తామని చంద్రబాబు హయాంలోని ప్రభుత్వం ఎందుకు టేకప్ చేసిందని అంబటి ప్రశ్నించారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బ తినడానికి టీడీపీ కారణం కాదా..? డయాఫ్రమ్ వాల్ విషయంలో చంద్రబాబు చేసిన తప్పిదానికి వేరే దేశంలో అయితే ఉరి వేసేవారు.
కాపర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రమ్ వాల్ కట్టడానికి ఎందుకు అనుమతించారని పీపీఏను, సీడబ్ల్యూసీని, కేంద్రాన్ని అడుగుతాం. సమయం వచ్చినప్పుడు కేంద్రాన్ని అడగుతాం. సంగం బ్యారేజ్ చంద్రబాబు రెక్కల కష్టమని టీడీపీ సిగ్గు లేకుండా మాట్లాడుతోంది. చంద్రబాబుకు అసలు రెక్కలున్నాయా..? చంద్రబాబు రెక్కలు లేని అక్కుపక్షి. కమ్యూనిస్టులో.. బీజేపీ వాళ్లో రెక్కలిస్తే ఎగిరేవాడు చంద్రబాబు. చంద్రబాబు అధికారంలో ఉన్నన్నాళ్లూ ఒక్క ప్రాజెక్టైనా పూర్తి చేయాలని ఆలోచన చేశారా..? 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు రైతులకు నీళ్లిచ్చేందుకు ప్రాజెక్టులు కట్టాలనే ఆలోచన చేశారా..?అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
చంద్రబాబు హయాం నుంచే సాగునీటి ప్రాజెక్టుల గేట్లు తుప్పు పట్టాయి.గుండ్లకమ్మ వద్ద గేట్ల కోసం కాకుండా 2014 నుంచి బ్యూటిఫికేషన్ కోసం గత ప్రభుత్వం 6 కోట్లు ఖర్చుపెట్టింది.గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు ఏర్పాటుకు కాంట్రాక్ట్ పిలిచాం..ఆ పాటికే గేటు కొట్టుకుపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న గేట్ల పై అధ్యయనం చేస్తున్నాం. అవసరమైన చోట్ల చర్యలు తీసుకుంటాం.
Read Also: Prabhas Spirit: ఆలులేదు చూలులేదు, అంతా ఫేక్.. బాంబ్ పేల్చిన స్టార్ హీరోయిన్