వికేత్రల మోసాలకు కూడా ఈ-కామర్స్ సంస్థలను బాధ్యులుగా చేసే విధంగా నిబంధనలకు కఠినతరం చేయడంపై కేంద్రం దృష్టి సారించింది. వాటిలో జవాబుదారీతనాన్ని మరింతగా పెంచేలా రూల్స్ ను రూపొందించడంపై వినియోగదారుల వ్వవహారాల శాఖ కసరత్తు చేస్తోంది.
Amazon: మామూలుగా ఏదైనా పోలీస్ ఆపరేషన్ జరుగుతుంటే జనాలు ఆ ప్రాంతం చుట్టువైపుల కూడా వెళ్లరు. అక్కడికి వెళ్తే ఎలాంటి సమస్యలు వస్తాయని భయపడుతుంటారు. కానీ అమెరికాలో మాత్రం ఓ అమెజాన్ ఎగ్జిక్యూటివ్ మాత్రం ఇలాంటి పరిస్థితుల మధ్య తన వృత్తి ధర్మాన్ని పాటించాడు. పోలీస్ ఆపరేషన్ కొనసాగుతున్న సమయంలో కూడా పార్సిల్ ఇచ్చేందుకు వెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. అమెరికాలోని ప్రధాన మీడియా సంస్థలు దీనిపై వార్తల్ని ప్రసారం చేశాయి.
Ghost Detector : సైన్స్ ఎంత వేగంగా వృద్ధి చెందుతున్నప్పటికీ నేటికీ చాలమంది దెయ్యాలను నమ్ముతారు. పారానార్మల్ యాక్టివిటీ కోరుకునేవారు.. హాంటెడ్ ప్రదేశాలు, తృప్తి చెందని ఆత్మలను ట్రాక్ చేస్తూ ఉంటారు.
నిబంధనలను ఉల్లంఘించి ఆన్లైన్లో ఔషధ విక్రయాలపై డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) షోకాజ్ నోటీసులు జారీ చేసిన 20 మంది ఆన్లైన్ విక్రేతలలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ హెల్త్ ప్లస్ కూడా ఉన్నాయి.
Special Story on Amazon’s Logistics Business: అమేజాన్ బ్రాండ్ లోగోలో.. A టు Zను తెలియజేస్తూ బాణం గుర్తుంటుంది. అది ఆ కంపెనీ డెలివరీ చేసే ప్రొడక్టుల రేంజ్‌కి అద్దం పడుతోంది. అంటే.. అమేజాన్ అందించని సేవలంటూ ఏమీ లేవని కూడా పరోక్షంగా అర్థంచేసుకోవచ్చు. ఇ-కామర్స్ రంగంలో దిగ్గజ సంస్థగా ఎదిగిన అమేజాన్.. ఇటీవల ఇండియాలో ‘అమేజాన్ ఎయిర్’ అనే సరికొత్త సర్వీసును లాంఛ్ చేసింది. దీంతో.. విమానాల ద్వారా కూడా ఉత్పత్తుల చేరవేతను ప్రారంభించింది.
ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో తెలంగాణ రెండో స్థానంలో ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో అమెజాన్ ఎయిర్‌కార్గో విమానమైన ప్రైమ్ ఎయిర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రపంచంలో హైదర్ బాద్ లో అమెజాన్ కు అతి పెద్ద క్యాంపస్ ఉందన్నారు.
Amazon: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అగ్రస్థానం దక్కించుకుంది. గతేడాది యాపిల్ తొలి స్థానంలో నిలవగా..ఈ ఏడాది అమెజాన్ తిరిగి తన స్థానాన్ని కైవసం చేసుకుంది.
Layoffs in the Indian tech industry: భారతీయ టెక్ పరిశ్రమల్లో కూడా లేఆఫ్స్ ఉండబోతున్నాయా..? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్, మెటా, యాపిల్, గూగుల్ వంటి అగ్రశ్రేణి కంపెనీలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ప్రపంచవ్యాప్తంగా ముంచుకొస్తున్న ఆర్థికమాంద్యం భయాల నేపథ్యంలో తమ నష్టాలను తగ్గించుకునేందుకు టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ ప్రభావం భారత కంపెనీలపై కూడా పడుతోంది.
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ భారీ సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధమవుతోంది. అమెజాన్ కంపెనీ తన కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లతో సహా దాదాపు 18 వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది.