Amazon: ఇకపై అమెజాన్ నుంచి డ్యామేజుడ్ ప్రోడక్ట్స్ డెలివరీలు ఉండవు..అంతా ఏఐ పుణ్యమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amazon: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ త్వరలో పూర్తిగా ఆటోమేషన్ మోడ్ లోకి మారిపోతోంది. ఇకపై అమెజాన్ నుంచి డ్యామేజుడ్ ప్రోడక్ట్స్ డెలివరీ, షిప్పింగ్ జరగకుండా AI సాంకేతికతను ఉపయోగిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇకపై పాడైన, దెబ్బతిన్న వస్తువులను పంపకుండా చర్యలు తీసుకుంటుంది. మనం తరుచుగా ఇంతకుముందు అమెజాన్ నుంచి డ్యామేజుడ్ ప్రోడక్ట్స్ రావడాన్ని చూశాం. అయితే ఇకపై అలా తప్పులు జరపకుండా ఏఐ టెక్నాలజీని వాడుకోనుంది అమెజాన్.
Read Also: AI Technology: ఉద్యోగాలకు ఎసరు పెడుతున్న ఏఐ టెక్నాలజీ.. మే నెలలో 4000 జాబ్స్ ఊస్ట్..
Also Read
- LPG UPI Payments: కొత్త యూపీఐ నిబంధన.. ఎల్పీజీ సిలిండర్లపై తీవ్ర ప్రభావం..?
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
- Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
అమెజాన్ వేర్ హౌజుల్లో కృత్రిమ మేధస్సు (AI)ని ఉపయోగిస్తున్నారు. వస్తువులను రవాణా చేసే ముందు తనిఖీ చేయడానికి ఏఐని ఉపయోగించి తక్కువ సమయంలో ప్యాకింగ్, ఆర్డర్ ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అమెజాన్ గిడ్డంగులను మరింతగా ఆటోమేషన్ తో నింపేయనుంది. సాధారణంగా వేర్ హౌజుల్లో కార్మికులు ఏదైనా ప్రోడక్ట్స్ ను క్షణ్ణంగా పరిశీలించి షిప్పింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో పని ఒత్తడి వల్ల చిన్నచిన్న డ్యామేజ్ వస్తువులను డెలివరీ చేయాల్సి ఉంటుంది. ఇటువంటి సందర్భాలు రాకుండా ఏఐ టెక్నాలజీని వాడాలని అనుకుంటున్నారు. దీనివల్ల కార్మికులపై ఒత్తిడి తగ్గనుంది.
కస్టమర్లకు పాడైన వస్తువులను తగ్గించాలనే ఉద్దేశ్యంతో ఏఐని అమెజాన్ ఇంట్రడ్యూస్ చేసింది. ఒక వేళ కస్టమర్లకు పాడైన వస్తువులను పంపిస్తే ఇది వారిని తీవ్ర నిరాశకకు గురిచేయడంతో పాటు బ్యాడ్ ఎక్స్ పీరియన్స్ గా మిగులుతుంది. దీని కోసమే ప్రస్తుతం అమెరికాలోని రెండు వేర్ హౌజుల్లో ఏఐ టెక్నాలజీని వాడుతున్నారు. ఉత్తర అమెరికా, యూరప్ లోని మరో 10 ప్రాంతాలకు దీన్ని విస్తరించాలని చూస్తున్నారు. అమెజాన్‌లో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ మేనేజర్ క్రిస్టోఫ్ స్క్వెర్డ్‌ఫెగర్ ప్రకారం, దెబ్బతిన్న వస్తువులను గుర్తించడంలో AI వ్యవస్థ మానవ కార్మికుడి కంటే మూడు రెట్లు మెరుగైనదని పేర్కొన్నారు. AIకి శిక్షణ ఇవ్వడానికి, అమెజాన్ పాడైపోని, దెబ్బతిన్న వస్తువులను చూపించే చిత్రాలను ఉపయోగించారు. ఈ చిత్రాలను పోల్చడం ద్వారా, AI వ్యవస్థ లోపాలను గుర్తించి సరైన వస్తువును ఎంచుకోగలదు.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
-
KTR : కాంగ్రెస్ హయాంలో కరెంట్ లేదు.. నీళ్లు లేవు.. కేటీఆర్ ఫైర్.!
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!