Amazon Prime Day 2023 Sale in July: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్స్ తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరోసారి ఆఫర్ల పండగ తీసుకొచ్చింది. ‘అమెజాన్ ప్రైమ్ డే’ సేల్ 2023ని తాజాగా ప్రకటించింది. కేవలం అమెజాన్ ప్రైమ్ సభ్యులకు మాత్రమే భారీ డిస్కౌంట్ ఉంటాయి. జులై 15, 16 తేదీల్లో అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఉంటుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్ టాప్‌లు, ఎలక్ట్రానిక్ వస్తువులు లాంటి వాటిపై భారీగా డిస్కౌంట్లు ఉంటాయని అమెజాన్ ప్రకటించింది.
జులై 15 అర్ధరాత్రి 12 గంటల నుంచి జులై 16 అర్ధరాత్రి 12 గంటల వరకు ‘అమెజాన్ ప్రైమ్ డే’ సేల్ 2023 అందుబాటులో ఉంటుంది. రెండు రోజుల పాటు కొనసాగే ఈ సేల్‌లో ప్రైమ్ మెంబర్లు భారీ డిస్కౌంట్ ధరకు నచ్చిన ఉత్పత్తులను కొనుగోలు చేయొచ్చు. ఈ సేల్‌లో భాగంగా ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డు, ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై 10 శాతం డిస్కౌంట్ ఉంది. అలానే అమెజాన్ పే-ఐసీఐసీఐ బ్యాంక్ కార్డు వినియోగదారులకు 5 శాతం తగ్గింపు ఆఫర్ ఉంది. ఇక కొత్తగా అమెజాన్ పే-ఐసీఐసీఐ బ్యాంక్ కార్డు తీసుకునే వారికి రూ. 2,500 విలువైన ప్రయోజనాలు పొందవచ్చు.
అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా 400 కంపెనీలకు చెందిన ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లు ఉంటాయని అమెజాన్ తెలిపింది. స్మార్ట్‌ఫోన్, ల్యాప్ ట్యాప్, కెమెరా, బ్లూటూత్ హెడ్ సెట్, ఏసీ, ఫ్రిడ్జ్‌లతో పాటు మరిన్ని బాటిపై భారీగా తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉన్నట్లు అమెజాన్ పేర్కొంది. ఇప్పటికే కొన్ని ప్రొడక్టులపై ఆఫర్లను అమెజాన్ రివీల్ చేయగా.. మరికొన్ని ఆఫర్ల వివరాలను వెల్లడించాల్సి ఉంది. త్వరలోనే పూర్తి వివరాలు తెలియరానున్నాయి. అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2023 సందర్భంగా కొత్తగా లాంచ్ అయిన లేదా అయ్యే స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్ ఆఫర్‌లు భారీగా ఉండనున్నాయి.
Also Read: Spy Movie Review: ‘స్పై’ మూవీ హిట్ అయినట్లేనా?