Tomato Face Mask: టొమాటోనే కదా అని తేలికగా తీసుకోవద్దు.. మీ బుగ్గలును గులాబీ రంగులో మెరిపిస్తుంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tomato Face Mask: కొన్ని నిత్యం మన కళ్లు ముందు కనిపించేవాటితో ఎన్నో ఉపయోగాలు ఉంటాయి.. వాటి గురించి తెలిసినప్పుడు.. ఔరా! అనిపించక మానదు.. టమోటా కేవలం వంటల్లో రుచిని పెంచడానికే కాదు, చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. ముఖ్యంగా టమోటా మరియు కలబంద తో తయారుచేసే ఫేస్ మాస్క్ చర్మాన్ని శుభ్రపరచి సహజ కాంతిని తీసుకురావడంలో ఉపయోగపడుతుంది. ఈ సహజ ఫేస్ మాస్క్ మచ్చలు తగ్గించడంలో, టాన్ తగ్గించడంలో సహాయపడుతుంది.
అవసరమైన పదార్థాలు
– సగం పండిన టమోటా
– 1–2 టీస్పూన్లు తాజా కలబంద జెల్
– ½ టీస్పూన్ తేనె
– ¼ టీస్పూన్ పసుపు పొడి
– 1 టీస్పూన్ శనగపిండి
Also Read
- Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే "బీరకాయ రోటి పచ్చడి" చేసేయండిలా..!
- Minapa Jantikalu: నూనె పీల్చకుండా, నెల రోజులు క్రిస్పీగా శెనగపిండి లేకుండానే కరకరలాడే "మినప జంతికలు" చేసేయండి ఇలా..!
- How to Choose Sweet Apples: యాపిల్ కొనేటప్పుడు రంగు చూసి మోసపోవద్దు.. తియ్యటి పండు కోసం సింపుల్ చిట్కాలు
- Sorakaya Sarvapindi: టేస్టీతో పాటు సూపర్ హెల్తీ.. ఘుమఘుమలాడే 'సొరకాయ సర్వపిండి' తింటే ఎన్ని లాభాల్లో తెలుసా?
ఫేస్ మాస్క్ తయారు చేసే విధానం
ముందుగా టమోటాను బాగా కడిగి పేస్ట్‌లా చేసుకోవాలి.. కలబంద ఆకును కోసి అందులోని జెల్ తీసుకోవాలి.. ఒక గిన్నెలో టమోటా పేస్ట్, కలబంద జెల్ వేసుకోవాలి.. అందులో తేనె, పసుపు, శనగపిండి వేసి బాగా కలపాలి.. మెత్తగా పేస్ట్‌లా అయ్యే వరకు కలపాలి. అవసరమైతే కొద్దిగా కలబంద జెల్ లేదా శనగపిండి జోడించవచ్చు.
ఫేస్ మాస్క్ ఎలా ఉపయోగించాలి
ముందుగా ముఖాన్ని తేలికపాటి ఫేస్ వాష్‌తో శుభ్రం చేసుకోవాలి… మాస్క్ వేసే ముందు చిన్న భాగంలో ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది… తరువాత ఈ మాస్క్‌ను ముఖం మరియు మెడపై అప్లై చేయాలి.. కళ్ల చుట్టూ, పెదవుల చుట్టూ అప్లై చేయకుండా జాగ్రత్త పడాలి.. 15–20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగి మాయిశ్చరైజర్ రాయాలి.. ఉత్తమ ఫలితాల కోసం వారానికి 1–2 సార్లు ఉపయోగించవచ్చు.
ఈ ఫేస్ మాస్క్ ప్రయోజనాలు
టమోటాలో ఉండే విటమిన్ C చర్మాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది.. టానింగ్ తగ్గించి చర్మానికి సహజ మెరుపును ఇస్తుంది… కలబంద చర్మాన్ని ప్రశాంతపరచి చికాకును తగ్గిస్తుంది.. చర్మాన్ని తేమగా ఉంచి ఆరోగ్యంగా కనిపించేలా చేస్తుంది. అయితే, ఇది కేవలం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించిన సమాచారం.. వీటిని అప్లై చేసే టప్పుడు వైద్యుల సలహా తీసుకుంటే బెటర్..
తాజావార్తలు
-
KPHB: హైదరాబాద్‌లో చీటీల పేరిట రూ.16 కోట్ల కుచ్చుటోపీ
-
IND Vs WI: సెంచరీతో చెలరేగిన గ్రీవ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం..
-
Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
-
Srikanth Odela: ‘నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌వి బిడ్డా’.. ‘పారడైజ్’ వివాదాస్పద సీన్‌పై శ్రీకాంత్ ఓదెల ఓపెన్ క్లారిటీ!
-
Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో మార్పులు..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?