Special Story on Amazon’s Logistics Business: అమేజాన్ బ్రాండ్ లోగోలో.. A టు Zను తెలియజేస్తూ బాణం గుర్తుంటుంది. అది ఆ కంపెనీ డెలివరీ చేసే ప్రొడక్టుల రేంజ్‌కి అద్దం పడుతోంది. అంటే.. అమేజాన్ అందించని సేవలంటూ ఏమీ లేవని కూడా పరోక్షంగా అర్థంచేసుకోవచ్చు. ఇ-కామర్స్ రంగంలో దిగ్గజ సంస్థగా ఎదిగిన అమేజాన్.. ఇటీవల ఇండియాలో ‘అమేజాన్ ఎయిర్’ అనే సరికొత్త సర్వీసును లాంఛ్ చేసింది. దీంతో.. విమానాల ద్వారా కూడా ఉత్పత్తుల చేరవేతను ప్రారంభించింది.
ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో తెలంగాణ రెండో స్థానంలో ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో అమెజాన్ ఎయిర్‌కార్గో విమానమైన ప్రైమ్ ఎయిర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రపంచంలో హైదర్ బాద్ లో అమెజాన్ కు అతి పెద్ద క్యాంపస్ ఉందన్నారు.
Amazon: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అగ్రస్థానం దక్కించుకుంది. గతేడాది యాపిల్ తొలి స్థానంలో నిలవగా..ఈ ఏడాది అమెజాన్ తిరిగి తన స్థానాన్ని కైవసం చేసుకుంది.
Layoffs in the Indian tech industry: భారతీయ టెక్ పరిశ్రమల్లో కూడా లేఆఫ్స్ ఉండబోతున్నాయా..? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్, మెటా, యాపిల్, గూగుల్ వంటి అగ్రశ్రేణి కంపెనీలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ప్రపంచవ్యాప్తంగా ముంచుకొస్తున్న ఆర్థికమాంద్యం భయాల నేపథ్యంలో తమ నష్టాలను తగ్గించుకునేందుకు టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ ప్రభావం భారత కంపెనీలపై కూడా పడుతోంది.
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ భారీ సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధమవుతోంది. అమెజాన్ కంపెనీ తన కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లతో సహా దాదాపు 18 వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది.
Delhi Acid Attack: ఢిల్లీ ద్వారకా ప్రాంతంలో 17 ఏళ్ల అమ్మాయిపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు నిందితుడు. బుధవారం ఉదయం రోడ్డుపై చెల్లితో నడుచుకుంటూ వెళ్తున్న అమ్మాయిపై ఇద్దరు నిందితులు బైక్ పై వచ్చి ముఖంపై యాసిడ్ తో దాడి చేశారు. ఈ కేసులో బాధితురాలుకు తెలిసిన ఇద్దరు వ్యక్తులే ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. బాధితురాలు ఇచ్చిన వివరాలతో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో నిందితుడు సంచలన విషయాలు వెల్లడించాడు. దాడికి ఉపయోగించిన…
Cisco Joins Global Wave Of Tech Lay-Offs, Will Cut 4,000 Jobs: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయాలు, ద్రవ్యోల్భనం, ఆదాయం తగ్గిపోవడవంతో టెక్ దిగ్గజాలు వరసగా తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో మరో టెక్ దిగ్గజ సంస్థ చేరింది. సిస్కో గత నెలలో 4000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వెల్లడించింది. తాజాగా ఈ తొలగింపు ప్రక్రియను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో దాదాపుగా 2 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతారని…
ఐటీ ఉద్యోగం అంటే లైఫ్ సెటిల్.. మంచి జీతం, కొత్త ఇల్లు.. ఏదైనా కొనగలిగే సమర్థత.. వాయిదాల పద్ధతి కూడా ఉండడంతో.. ఏ వస్తువునైనా కొనేసే ఆర్థికస్తోమత.. అయితే, ఇప్పుడు వారి పరిస్థితి తలకిందులుగా మారిపోయింది… ఆర్ధిక మాంద్యం ముంచుకొస్తుందన్న ఆర్ధిక నిపుణుల హెచ్చరికలతో చిన్న చిన్న కంపెనీల నుంచి దిగ్గజ టెక్ సంస్థల వరకు కాస్ట్ కటింగ్ పేరుతో వర్క్ ఫోర్స్ ను తగ్గించుకుంటున్నాయి. ఇప్పటికే దిగ్గజ సంస్థలు పెద్ద ఎత్తున ఉద్యోగులను ఇంటికి పంపించాయి..…
Amazon Plans To Sack 20,000 Employees: ఆర్థిక మందగమనం, ఆర్థిక మాంద్యం పరిస్థితులు, ద్రవ్యోల్భణం భయాల మధ్య పలు టెక్ కంపెనీలు వరసగా తమ ఉద్యోగులను తీసేస్తున్నాయి. ట్విట్టర్ లో మొదలైన ఈ తొలగింపులు వరసగా కొనసాగుతున్నాయి. మైక్రోసాప్ట్, గూగుల్, అమెజాన్ ఇలా ప్రముఖ టెక్ దిగ్గజాలు అన్నీ కూడా తమ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించాయి. లాభాలు తగ్గడంతో ఖర్చులు తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి.