Amazon : నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్..20 లక్షల ఉద్యోగాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ నిరుద్యోగులకు వరాల జల్లు కురిపించింది.. పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చెయ్యడానికి కసరత్తులు చేస్తుంది.. ఇండియాలో భారీగా ఉద్యోగాలను ఇచ్చేందుకు కీలక ప్రకటన చేసింది..ఈ ప్రకటన వల్ల చాలా మందికి ఉపాధి లభిస్తుందని చెప్పుకోవచ్చు. భారత్‌లో మరో 15 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తామని అమెజాన్ ప్రకటించింది. దీంతో దేశంలో అమెజాన్ పెట్టుబడులు 26 బిలియన్ డాలర్లకు చేరుతాయని తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం తర్వాత అమెజాన్ సీఈవో యాండీ జస్సీ ఈ విషయాన్ని ప్రకటించారు. ఇప్పటి వరకు భారత్‌లో 11 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశామని, అలాగే భవిష్యత్‌లో మరో 15 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తామని ఆయన వెల్లడించారు.
ఈ నేపథంలో 2023 మొత్తంగా 26 బిలియన్ డాలర్ల ను ఇన్వెస్ట్ చేస్తామని తెలిపారు.. ఈ మేరకు కొత్త కంపెనీలకు భరోసా కల్పిస్తామని, కొత్తగా ఉద్యోగాలను పెంచుతామని , అలాగే కొత్త ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తామని, స్మాల్ బిజినెస్‌కలు మద్దతుగా ఉంటాయని ఆయన వివరించారు. ట్విట్టర్ వేదికగా ఈ విషయాలను వెల్లడించారు.. అదే విధంగా ఇండియన్ స్టార్టప్స్, ఉపాధి కల్పన, ఎగుమతులను ప్రోత్సహించడం, డిజిటలైజేషన్ వంటి పలు అంశాలపై ఇరువురు మాట్లాడుకున్నారు. 2023 కల్లా 10 మిలియన్ స్మాల్ బిజినెస్‌లను డిజిటైజ్ చేయడం, 20 బిలియన్ డాలర్ల ఎగుమతులు, 20 లక్షల ఉద్యోగాలను ఇచ్చేందుకు సహకరిస్తామని అన్నారు..
Also Read
ఇక ఈ విషయం పై ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు..యాండీ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. కాగా అమెజాన్ భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించి పదేళ్లు పూర్తి అయ్యింది. ఇప్పటికే 12 లక్షల ఇండియన్ బిజినెస్‌లకు సపోర్ట్ గా నిలుస్తుంది.. అలాగే ఇండియాలో తయారావుతున్న కోట్ల ప్రొడక్టులను ఆన్‌లైన్‌లో విక్రయిస్తోంది. చాలా వరకు పిన్ కోడ్స్‌కు సర్వీసులు అందుబాటులో ఉంచింది.. భవిష్యత్ లో మరిన్ని బిజినెస్ లను భారత్ లో మొదలు పెట్టనున్నట్లు ఆయా సంస్థ అధినేత చెప్పుకొచ్చారు..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!