Purchase Samsung Galaxy S20 FE 5G Smartphone only Rs 28 Thousand in Amazon: సౌత్ కొరియాకు చెందిన మొబైల్ కంపెనీ ‘శాంసంగ్’కి భారత మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. శాంసంగ్ కంపెనీ ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తూ.. కస్టమర్లను తెగ ఆకర్షిస్తోంది. అయితే భారతదేశంలో గతేడాది రిలీజ్ అయిన స్మార్ట్‌ఫోన్ ‘శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ’ (Samsung Galaxy S20 FE 5G)పై ప్రస్తుతం మంచి ఆఫర్స్ ఉన్నాయి. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’లో కస్టమర్ల కోసం సూపర్ ఆఫర్ ప్రారంభించబడింది. ఇందులో ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై భారీ తగ్గింపు ఇవ్వబడుతుంది. 75 వేల శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం 28 వేలకే మీరు సొంతం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
Samsung Galaxy S20 FE 5G Price:
శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5Gపై అమెజాన్‌లో భారీ తగ్గింపు ఆఫర్ అందించబడుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 74,999. ఈ ధరతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను సామాన్య ప్రజలు కొనుగోలు చేయడం దాదాపుగా అసాధ్యమే. అందుకే ఈ ఫోన్‌పై అమెజాన్ ఏకంగా 63 శాతం తగ్గింపు ఆఫర్ ప్రకటించిది. ఈ డిస్కౌంట్ తర్వాత కస్టమర్‌లు కేవలం రూ. 27,999కే గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ ఫోన్‌ను ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. అంటే దాదాపుగా మీరు 47 వేల రూపాయలను ఆదా చేసుకోవచ్చు. ఈ ఆఫర్ తెలియడంతో జనాలు కొనడానికి ఎగబడుతున్నారు.
Also Read:
Ashes 2023: నా జీవితంలో ఇదే మొదటిసారి.. ఇంగ్లండ్ క్రికెట్ జట్టుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఫుట్‌బాల్ కోచ్!
Samsung Galaxy S20 FE 5G Battery:
ఈ 5G స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్‌లో పనిచేస్తుంది. దీనిలో మీరు 8GB RAMతో 128GB ఇంటర్నల్ స్టోరేజ్ పొందుతారు. 6.5-అంగుళాల ఇన్ఫినిటీ-O సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1080 x 2400 పిక్సెల్‌ల ఫుల్ హెచ్ డీ+ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 12MP వైడ్-రియర్ కెమెరా, 8MP టెలి-కెమెరా మరియు 12MP అల్ట్రా-కెమెరా ఉన్నాయి. 32MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4,500mAh బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.
స్పెసిఫికేషన్లు (Samsung Galaxy S20 FE 5G Specs):
# 5G స్మార్ట్‌ఫోన్
# 6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ సూపర్ అమోఎల్ఈడీ ఇన్ ఫినిటీ-ఓ డిస్ ప్లే
# క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్
# 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
# డ్యూయల్ ట్రిపుల్ కెమెరా (12MP, 8MP, 12MP)
# 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా
# 4500 ఎంఏహెచ్ బ్యాటరీ
Also Read: Ashes 2023: సూపర్ ఫీల్డ్ సెట్ చేసిన బెన్ స్టోక్స్.. తడిసిపోయిన స్టీవ్ స్మిత్ ప్యాంట్!