‘ఇస్మార్ట్ శంకర్’తో లవర్ బాయ్ నుంచి ఉస్తాద్‌గా అవతరించినప్పటి నుంచీ రామ్ పోతినేని తన స్పీడ్ పెంచాడు. వరుసగా క్రేజీ ప్రాజెక్టుల్ని లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే లింగుసామీ దర్శకత్వంలో ‘ద వారియర్’ అనే బైలింగ్వల్ కంప్లీట్ చేసిన ఈ ఎనర్జిటిక్ హీరోగా.. త్వరలోనే బోయపాటి శ్రీనుతో సెట్స్ మీదకు వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పుడు లేటెస్ట్గా మరో సినిమాకి కూడా ఇతడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. సినీ వర్గాల్లో వినిపిస్తోన్న వార్తల ప్రకారం.. దర్శకుడు హరీశ్…
పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. పుష్ప ది రైజ్ మూవీ ఘనవిజయం సాధించడంతో జాతీయ స్థాయిలో బన్నీకి గుర్తింపు వచ్చింది. దీంతో పుష్ప సెకండ్ పార్ట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పుష్ప ది రూల్ మూవీ కోసం జోరుగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు నడుస్తున్నాయి. పుష్ప-1 కంటే పుష్ప-2 సినిమాను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాలని దర్శకుడు సుకుమార్ కృతనిశ్చయంతో ఉన్నాడు. పుష్ప ది రూల్ మూవీ…
గద్దలకొండ గణేశ్ నుంచి దర్శకుడు హరీశ్ శంకర్ ఖాళీగానే ఉన్నాడు. తదుపరి సినిమాపై చాలాకాలం కసరత్తు చేసిన తర్వాత.. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ తో గ్రీన్ సిగ్నల్ వేయించుకున్నాడు. కానీ, ఈ సినిమా ప్రకటన వచ్చి చాలాకాలమే అవుతోన్నా, ఇంకా సెట్స్ మీదకి వెళ్లలేదు. పవన్ తన పొలిటికల్ వ్యవహారాలతో బిజీగా ఉండటం వల్ల, ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తోంది. దీనికితోడు ఆయన చేతిలో ఇతర ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. లేటెస్ట్ న్యూస్ ప్రకారం.. ఇది…
అటు తమిళం ఇటు తెలుగులో హాట్ టాపిక్ లోకేశ్ కనకరాజ్. కమల్ హాసన్ తో లోకేష్ తీసిన ‘విక్రమ్’ సినిమా అఖండ విజయం సాధించింది. కమల్ కున్ను అప్పులన్నింటినీ తీర్చిన సినిమాగా ‘విక్రమ్’ నిలిచింది. సందీప్ కిషన్ తో తీసిన ‘మానగరం’, ఆ తర్వాత కార్తీతో ‘ఖైదీ’, విజయ్ తో ‘మాస్టర్’ సినిమాలు సైతం లోకేష్ ప్రతిభకు పట్టం కట్టాయి. ఇప్పుడు ‘విక్రమ్’తో అపజయం ఎరుగని దర్శకుల ఖాతాలో చేరిపోయాడు లోకేష్. దాంతో టాలీవుడ్ లో లోకేష్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెగ్గేదెలే అన్నట్లుగా బాక్స్‌ఫీస్ వద్ద బ్లాక్ బస్టార్ హిట్ కొట్టి.. పాన్ ఇండియా వైడ్‌గా రికార్డుల వర్షం కురిపించింది పుష్ప ‘ది రైజ్’ సినిమా. అయితే ఈ సినిమాలో కథనాయికగా అభినయించి రష్మికకు కూడా నేషనల్ వైడ్‌గా ఫాలోయింగ్ మరింత పెరిగింది. అయితే.. ఈ సినిమా మొదటి భాగం రికార్డుల వర్షం కురిపించడంతో.. రెండో భాగం పుష్ప ‘ది రూల్’పై ప్రత్యేక దృష్టి సారించారు దర్శకుడు సుకుమార్.…
పంపిణీదారునిగా కెరియర్ మొదలుపెట్టి ‘100% లవ్’ సినిమాతో నిర్మాతగా మారి వరుసగా పలు విజయవంతమైన సినిమాలు నిర్మించాడు బన్నీవాస్. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా బన్నీ వాస్ నిర్మించిన ‘పక్కా కమర్షియల్’ జూలై 1న విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమా విశేషాలతో పాటు తమ తదుపరి సినిమాల వివరాలను పుట్టినరోజు సందర్బంగా మీడియాతో పంచుకున్నారు. ఎంత సంపాదించాం అన్నది పక్కన పెడితే ప్రేక్షకులను థియేటర్లకు ఎంత దగ్గరగా ఉంచాం అనేది ముఖ్యమైన విషయం. అందుకోసమే ‘పక్కా కమర్షియల్’…
బన్నీకి వివాదాలు కొత్తేం కాదు.. అయితే అల్లు అర్జున్ పై వచ్చే వివాదాలన్నీ కూడా.. దాదాపుగా కమర్షియల్ యాడ్స్‌కు సంబంధించినవే. అందుకే బన్నీ ఈ సారి మరో కొత్త వివాదంలో అంటూ.. జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు తప్పుదోవ పటిస్తున్నాడంటూ.. ఐకాన్ స్టార్ పై కేసు కూడా నమోదైందట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ బన్నీపై వస్తున్న ఈ కొత్త ఇష్యూ ఏంటి..! ఇటీవలె బన్నీ నటించిన పుష్ప చిత్రం..…
పుష్ప సినిమా రిలీజ్ అయి ఆరు నెలలు దాటిపోయింది. అయినా ఇప్పటి వరకు సెకండ్ పార్ట్ షూటింగ్ మొదలు పెట్టలేదు. అయితే పార్ట్ వన్‌తో అంచనాలు పెరగడంతో.. సీక్వెల్‌ను పకడ్బందిగా ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. అందుకే లేట్ అవుతున్నట్టు తెలుస్తోంది. కానీ లేటెస్ట్ అప్టేట్ ప్రకారం పుష్పరాజ్ వేట మొదలైపోయిందని సమాచారం. అయితే ముందుగా నటీనటుల వేటలో పడిందట సుకుమార్ టీమ్.. మరి పుష్పరాజ్ ఏం చేస్తున్నాడు..? పుష్ప మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలవడంతో.. పుష్ప…
అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో వచ్చిన ‘పుష్ప: ద రైజ్’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు! ముఖ్యంగా, అది బాలీవుడ్లో సృష్టించిన ప్రకంపనాలు అన్నీ ఇన్నీ కావు. అక్కడ ఎలాంటి అంచనాలు లేకుండానే విడుదలైన ఈ చిత్రం.. ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్లో చేరి, అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ సినిమా సత్తా చాటింది. దీంతో సుకుమార్ ఈ సినిమా సీక్వెల్ ‘పుష్ప 2’ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. పాన్ ఇండియా…