Allu Arjun: టాలీవుడ్ స్టార్ హీరోల కన్ను ప్రస్తుతం పాన్ ఇండియా మీద పడింది. అన్ని భాషల్లోనూ తమ సత్తా చూపించుకోవాలని ప్రతి ఒక హీరో తాపత్రయపడుతున్నారు. తెలుగులోనే కాకుండా హిందీలోనూ తమ సత్తా చాటాడడానికి రెడీ అవుతున్నార. ఇప్పటికే పాన్ ఇండియా సినిమాల ద్వారా హిందీలో అభిమానులను సంపాదించుకున్న హీరోలు బాలీవుడ్ స్ట్రైట్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే బాలీవుడ్ సైతం ప్రస్తుతం టాలీవుడ్ వైపే చూస్తోంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కానీ, కొంతమంది హీరోలు మాత్రం బాలీవుడ్ వైపు తొంగి చూడం అంటున్నారు. ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీపై పలు సంచలన వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ గా మారిన విషయం విదితమే. బాలీవుడ్ కు వెళ్లాలనే ఉద్దేశ్యం తనకు లేదని. అక్కడ తనకు అంత కంఫర్ట్ ఉండదని చెప్పుకురావడం పెద్ద వివాదానికే దారి తీసింది. ఇక తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా బాలీవుడ్ ఎంట్రీపై షాకింగ్ కామెంట్స్ చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది.
పుష్ప చిత్రంతో బన్నీకి బాలీవుడ్ ఫిదా అయిపోయిన విషయం తెల్సిందే. చిన్నా లేదు.. పెద్దా లేదు. అభిమానులు అని లేదు.. ప్రముఖులు అని లేదు. ఎక్కడ చూసినా పుష్ప.. తగ్గేదేలే అన్న డైలాగ్ మారుమ్రోగిపోయింది. అంతటి భారీ విజయాన్ని అందుకున్న బన్నీ.. ఇదే ఊపులో ఒక బాలీవుడ్ మూవీ తీస్తే హిట్ పాడడం పక్కా అనో బాలీవుడ్ అభిమానులు నొక్కివక్కాణిస్తున్నారు. ఇటీవల బన్నీ బాలీవుడ్ ఎంట్రీ ఉండనున్నదన్న వార్తలు కూడా గుప్పుమన్నాయి. అయితే వాటిలో ఏ నిజం లేదని, తనకు బాలీవుడ్ ఎంట్రీపై ఇంట్రస్ట్ లేదని బన్నీ తేల్చేశాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బాలీవుడ్ ఎంట్రీ గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ “నాకు బాలీవుడ్ లో నటించడం కంఫర్ట్ అనిపించదు.. కానీ, ఖచ్చితంగా కథ బావుండి చేయాలి అనిపిస్తే చేస్తాను. ఇటీవల ఒక బాలీవుడ్ దర్శకుడు కథ చెప్పాడు. అది చాలా సాదా సీదా గా అనిపించింది. సున్నితంగా తిరస్కరించాను. రొటీన్ కథలు కాకుండా మంచి కథలు వస్తే హిందీలో త్వరలోనే నటిస్తాను అనుకుంటున్నాను. కానీ, అక్కడ నటించాలి అంటే ఎంతో ధైర్యం కావాలి” అని చెప్పుకొచ్చాడు. మరి బన్నీ చెప్పినదాని ప్రకారం త్వరలోనే బాలీవుడ్ లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. మరి బాలీవుడ్ లో బన్నీని పరిచయం చేసే డైరెక్టర్ ఎవరో చూడాలి.