Allu Arjun Movie Pushpa The Rule Movie Will Be Released In 10 Languages.
సైలిష్‌స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఏ రేంజ్‌లో హిట్‌అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టడమే కాకుండా.. కొత్త కొత్త రికార్డులను సైతం సృష్టించింది. అయితే.. ఇప్పటికే దర్శకుడు సుకుమార్ సెంకండ్ పార్టీ పుష్ప-ది రూల్‌కు సిద్ధమవుతున్నాడు. త్వరలోనే రెండో భాగం రెగ్యులర్ షూట్ ఆగస్టు లేక సెప్టెంబర్‌లో ప్రారంభం కానుంది. అయితే.. ఈ సినిమాను తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో విడుదల చేయాలనుకున్నారు మైత్రీ మూవీ మేకర్స్ వారు.
అంతేకాకుండా.. మరో ఐదు ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ లోను ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఫస్టు పార్టులో బన్నీ .. రష్మిక .. ఫహాద్ .. సునీల్ .. అనసూయ పాత్రలు హైలైట్ గా నిలిచాయి. అయితే.. మొదటి భాగం ఊహించని రీతిలో హిట్ కొట్టడంతో.. రెండో పార్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే.. ఆ అంచనాలకు తగ్గకుండా దర్శకుడు సుకుమార్ కథపై కసరత్తు చేస్తున్నారు. ది రూల్ పార్ట్‌లో ఎవరెవరి పాత్రలు అలరిస్తాయో చూడాలి.