Fahadh Faasil Gives Hint On Pushpa Part 3: సీక్వెల్ సినిమాలు దాదాపు రెండో భాగంతోనే పూర్తవుతాయి. మూడోది అంటే గగనమే! తెలుగులో ఇంతవరకూ అలాంటి ప్రయత్నమైతే జరగలేదు. ఏవో ఒకట్రెండు చిన్న సినిమాల (మనీ) నుంచి మూడు భాగాలు వచ్చి ఉండొచ్చేమో గానీ, క్రేజీ ప్రాజెక్టులైతే రెండో భాగానికి ఆగిపోయాయి. అయితే.. తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ మాత్రం పుష్పకి మూడో సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నాడు. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం.…
Allu Arjun: టాలీవుడ్ స్టార్ హీరోల కన్ను ప్రస్తుతం పాన్ ఇండియా మీద పడింది. అన్ని భాషల్లోనూ తమ సత్తా చూపించుకోవాలని ప్రతి ఒక హీరో తాపత్రయపడుతున్నారు. తెలుగులోనే కాకుండా హిందీలోనూ తమ సత్తా చాటాడడానికి రెడీ అవుతున్నార. ఇప్పటికే పాన్ ఇండియా సినిమాల ద్వారా హిందీలో అభిమానులను సంపాదించుకున్న హీరోలు బాలీవుడ్ స్ట్రైట్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు కేవలం తెలుగు హీరో మాత్రమే కాదు…. పాన్ ఇండియా స్టార్. అయితే… దానికంటే ముందు అతను టాలీవుడ్ తో పాటే మల్లూవుడ్ లోనూ లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అలా స్టెప్ బై స్టెప్ పరాయి రాష్ట్రాలలోనూ ఫ్యాన్ బేస్ ను పెంచుకుంటూ వచ్చిన అల్లు అర్జున్ తొలిసారి ‘పుష్ప’ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఈ సినిమా ఉత్తరాదిలో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది.…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప' సినిమా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ చిత్రంపై ముందు నుంచి అల్లు అర్జున్ పెట్టుకున్న ప్రతీ నమ్మకం నిజం అవుతూనే ఉంది.
2016లో లింగుసామి, అల్లు అర్జున్ కాంబోలో ఓ మూవీ అనౌన్స్మెంట్ వచ్చిన సంగతి గుర్తుందా? తమిళనాడులో గ్రాండ్గా ఓ ఈవెంట్ కూడా నిర్వహించారు. అప్పట్లో ఈ ప్రాజెక్ట్ గురించి పెద్ద హడావుడే నడిచింది. కానీ, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఎలాంటి ఊసే రాలేదు. భారీస్థాయిలో ప్రకటించిన ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. రెండు, మూడు సార్లు ఈ సినిమాకి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయన్న వార్తలు వచ్చాయే తప్ప.. యూనిట్ వర్గాల నుంచి మాత్రం…
సినిమా కథలు ఒక హీరో నుంచి మరో హీరోకి షిఫ్ట్ అవ్వడాన్ని మనం తరచూ చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు విడుదలకు ముస్తాబవుతున్న ‘ద వారియర్’ సినిమా కూడా ఆ జాబితాకు చెందినదే! లింగుసామి దర్శకత్వంలో రూపొందిన ఈ బైలింగ్వల్ సినిమాకు ఫస్ట్ ఛాయిస్ రామ్ పోతినేని కాదని తాజాగా తేలింది. రామ్ కంటే ముందు ఈ సినిమా స్టోరీ ఓ స్టార్ హీరో వద్దకు వెళ్లింది. ఇంతకీ అతనెవరా? అని అనుకుంటున్నారా! మరెవ్వరో కాదు.. ఐకాన్ స్టార్…
అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో వచ్చిన ‘పుష్ప’ సినిమా దక్షిణాది కంటే ఉత్తరాదిన ఘన విజయం సాధించింది. బాలీవుడ్ లో ఎలాంటి ఇమేజ్ లేని బన్నీ ఈ సినిమాతో ఒక్క సారిగా సూపర్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. దాంతో వెంటనే సెకండ్ పార్ట్ ను కూడా స్క్రీన్ పై కి తెచ్చారు. నిజానికి ఈ సినిమా కంటే ముందు మరో సినిమా చేయాలనుకున్నాడు అల్లువారి అబ్బాయి. అయితే ‘పుష్ప’ ఘన విజయంతో టోటల్ ప్లాన్ ఛేంజ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలసి విహారయాత్రలో ఉన్నాడు. అందులో భాగంగా భార్య స్నేహా రెడ్డి పిల్లలు, అర్హ, అయాన్ తో ఆఫ్రికన్ అడవుల్లో విహరిస్తున్నారు. ఇటీవల అల్లు స్నేహారెడ్డి తన సోషల్ మీడియాలో టాంజానియాలోని సెరెంగేటి నేషనల్ పార్క్ను విజిట్ చేసిన విషయాన్ని తెలియచేస్తూ ఓ పిక్ పెట్టింది. నిజానికి అల్లు అర్జున్ ఫ్యామితో విహరిస్తున్నప్పటికీ తన విహారయాత్రతో పాటు త్వరలో ఆరంభం కాబోయే ‘పుష్ప2’ సినిమా లొకేషన్ల వేట కూడా చేస్తున్నట్లు సమాచారం.…
పుష్ప: ద రైజ్ విడుదలైన కొన్ని రోజులకే పుష్ప: ద రూల్ సినిమాను ఫిబ్రవరిలో ప్రారంభిస్తామని సుకుమార్ సహా నిర్మాతలు స్పష్టం చేశారు. కానీ.. ఇప్పటివరకూ ప్రారంభం కాలేదు. కారణం.. స్క్రిప్టులో మార్పులు చేయడమే! పాన్ ఇండియా లెవెల్లో పుష్ప ఘనవిజయం సాధించడంతో.. సుకుమార్ స్క్రిప్టుపై మరోసారి కసరత్తులు చేయడం మొదలుపెట్టాడు. కొత్త కొత్త పాత్రల్ని డిజైన్ చేస్తూ.. వాటి కోసం క్రేజీ నటీనటుల్ని రంగంలోకి దింపుతున్నాడు. మొదటి భాగానికి పూర్తి న్యాయం చేసేలా సరైన మెరుగులు…
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఎంత గొప్ప నటుడో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తన సినీ ప్రస్థానం ప్రారంభించిన ఈయన.. ఆ తర్వాత హీరోగా అవతారం ఎత్తాడు. అనంతరం విలక్షణ పాత్రలు పోషించడం కూడా మొదలుపెట్టాడు. నెగెటివ్ షేడ్స్ ఉన్నా సరే.. పాత్ర నచ్చిందంటే చాలు, చేసేస్తాడు. ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసి, దానికి జీవం పోస్తాడు. ఇలా తనని తాను బిల్డ్ చేసుకుంటూ.. పాన్ ఇండియా నటుడిగా అవతరించాడు. ఫలితంగా..…