Lingusamy: బన్నీతో సినిమా.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన డైరెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2016లో లింగుసామి, అల్లు అర్జున్ కాంబోలో ఓ మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చిన సంగతి గుర్తుందా? తమిళనాడులో గ్రాండ్‌గా ఓ ఈవెంట్ కూడా నిర్వహించారు. అప్పట్లో ఈ ప్రాజెక్ట్ గురించి పెద్ద హడావుడే నడిచింది. కానీ, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఎలాంటి ఊసే రాలేదు. భారీస్థాయిలో ప్రకటించిన ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. రెండు, మూడు సార్లు ఈ సినిమాకి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయన్న వార్తలు వచ్చాయే తప్ప.. యూనిట్ వర్గాల నుంచి మాత్రం ఏ సమాచారమూ రాలేదు. చూస్తుండగానే ఈ ప్రాజెక్ట్‌ని అంతా మర్చిపోయారు. అటు లింగుసామి, ఇటు అల్లు అర్జున్ వేరే ప్రాజెక్టులతో బిజీ అయిపోయారు. దీంతో, ఇది అటకెక్కినట్టేనని అంతా ఫిక్సైపోయారు.
అంతేకాదు.. ఇప్పుడు ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనితో చేసిన ‘ద వారియర్’ సినిమా అల్లు అర్జున్ రిజెక్ట్ చేసినదేనని ప్రచారమూ ఊపందుకుంది. ఈ నేపథ్యంలోనే ఇది నిజమా? కాదా? అసలు బన్నీతో ప్రాజెక్ట్ ఏమైంది? అనే వివరాలు తెలుసుకోవడం కోసం.. ‘ద వారియర్’ ప్రచార కార్యక్రమాల్లో ఉన్న దర్శకుడు లింగుసామిని ఆరా తీయడం మొదలుపెట్టారు. ఎట్టకేలకు తాజా ఇంటర్వ్యూలో ఆయన పెదవి విప్పారు. తాను బన్నీతో రెగ్యులర్ టచ్‌లోనే ఉన్నానని, అతనితో చేయాల్సిన ప్రాజెక్ట్ అటకెక్కలేదని క్లారిటీ ఇచ్చాడు. రామ్‌తో తీసిన ద వారియర్ కథ బన్నీ రిజెక్ట్ చేసింది కాదని, అతనికి చెప్పిన కథ మరొకటని స్పష్టం చేశాడు. భవిష్యత్తులో తమ ప్రాజెక్ట్ కచ్ఛితంగా రూపుదాల్చుకుంటుందని చెప్పుకొచ్చాడు.
Also Read
- Ranabaali: ప్రెగ్నెంట్‌గా రష్మిక.. ‘జయమ్మ’కు గుడ్‌బై చెప్పేసిన నేషనల్ క్రష్, సెట్స్‌లో విజయ్ స్పెషల్ హగ్!
- Abir Singh Debut: సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ కొడుకు హీరోగా ఎంట్రీ.. ‘టార్జాన్’ రాబోతున్న అబీర్, తోడుగా ఆ హీరో!
- Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
- Vijay - Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
అయితే.. ప్రస్తుతం బన్నీ ‘పుష్ప 2’ సినిమా పనులతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి, కచ్ఛితంగా ఎప్పుడు ముగుస్తుందో క్లారిటీ లేదు. ఆ తర్వాత బోయపాటి శ్రీనుతోనూ బన్నీ ఓ ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడు. మరి, లింగుసామితో సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో? పైగా.. బన్నీ ఈ మధ్య తన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ లెక్కన.. లింగుసామితో సినిమా చేయాలా? వద్దా? అన్నది ‘ద వారియర్’ రిజల్ట్ మీద ఆధారపడి ఉండనుందని చెప్పుకోవచ్చు.
తాజావార్తలు
-
US China AI race: AIని గెలిచిన దేశానిదే ప్రపంచ ఆధిపత్యం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Ranabaali: ప్రెగ్నెంట్‌గా రష్మిక.. ‘జయమ్మ’కు గుడ్‌బై చెప్పేసిన నేషనల్ క్రష్, సెట్స్‌లో విజయ్ స్పెషల్ హగ్!
-
Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!
-
Women’s Asia Cup Final 2026: టీమిండియా ఛాంపియన్స్.. కానీ ట్రోఫీ ఎక్కడ? నఖ్వీతో మళ్లీ వివాదం
-
Women’s Asia Cup 2026: ష్రీ చరణి బౌలింగ్ దెబ్బకు శ్రీలంక విలవిల.. మహిళల ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!