ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు కేవలం తెలుగు హీరో మాత్రమే కాదు…. పాన్ ఇండియా స్టార్. అయితే… దానికంటే ముందు అతను టాలీవుడ్ తో పాటే మల్లూవుడ్ లోనూ లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అలా స్టెప్ బై స్టెప్ పరాయి రాష్ట్రాలలోనూ ఫ్యాన్ బేస్ ను పెంచుకుంటూ వచ్చిన అల్లు అర్జున్ తొలిసారి ‘పుష్ప’ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఈ సినిమా ఉత్తరాదిలో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మూవీ కోసం దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చిన బాణీలు మూవీని మరో లెవెల్ కు తీసుకెళ్ళాయి. ఇప్పుడు దేశ వ్యాప్తంగా అందరి కళ్ళూ ‘పుష్ప -2’ మీదనే ఉన్నాయి. అందుకే మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ మరింత ప్రతిష్ఠాత్మకంగా ‘పుష్ప -2’ను తెరకెక్కించే పనిలో పడింది.
ఇదిలా ఉంటే… ఇవాళ దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని సినీ రంగాల దృష్టి సౌతిండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మీదనే ఉంది. వివిధ భాషల్లో పాన్ ఇండియా మూవీస్ ఇక్కడే ఎక్కువగా తయారవుతున్నాయి. దానికి సంబంధించిన కవర్ స్టోరీని ప్రముఖ వార పత్రిక ‘ఇండియా టు డే’ ప్రచురించింది. తాజా ఇష్యూ కవర్ పేజీగా అల్లు అర్జున్ స్టిల్ ను ప్రచురించడం విశేషం. తొలి పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’తోనే అల్లు అర్జున్ సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. అందులోని ‘తగ్గదే లే’ అనే పదాన్ని ఇవాళ ప్రతి రోజూ కోట్లాది మంది జపిస్తూనే ఉన్నారు. ఇండియా టుడే పత్రిక బన్నీ కవర్ పేజీగా అల్లు అర్జున్ స్టిల్ వేసి, అతను సౌండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఐకాన్ అని చెప్పకనే చెప్పేసింది. ఈ ముఖ చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో విశేషంగా చక్కర్లు కొడుతోంది.