ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల అరాచకాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి.. దీంతో.. అక్కడ చిక్కుకున్న మనవాళ్ల పరిస్థితి ఏంటి? అనే ఆందోళన నెలకొంది.. ఈ తరుణంలో.. ఆఫ్ఘన్ నుంచి భారత్‌కు ప్రతీ రోజు రెండు విమాన సర్వీసులు నడిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.. కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి భారత్ ఇకపై రోజుకు రెండు విమాన సర్వీసులు నడిపేందుకు అమెరికా అనుమతిచ్చినట్టు చెబుతున్నాయి కేంద్ర ప్రభుత్వ వర్గాలు. ప్రస్తుతం కాబూల్‌లోని విమానాశ్రయంలో కార్యకలాపాలు అమెరికా నాటో బలగాల…
తాలిబన్ల పాలన మాకొద్దు.. అంటూ లక్షలాది మంది కాబుల్ ఎయిర్పోర్ట్ దగ్గర పడిగాపులు కాస్తున్నారు. తిండి తిప్పలు లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎయిర్పోర్ట్ బయట తాలిబన్లు.. లోపల విదేశీ బలగాలు పహారా కాస్తున్నాయ్. రోజులకొద్దీ అక్కడే ఉండటంతో చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహిళల ఆర్తనాదాలు, పసి పిల్లల ఏడుపులతో ఆ ప్రాంతంలో హృదయవిదారక దృశ్యాలు కనిపిస్తున్నాయ్. కొందరైతే తమ పిల్లలైనా కాపాడాలంటూ పిల్లలను విదేశీ బలగాలకు ఇచ్చేస్తున్నారు. ఓవైపు కన్నపేగు మమకారం.. మరోవైపు తాలిబన్ల…
అఫ్ఘానిస్థాన్ దేశాన్ని ఆక్రమించుకొన్న కొద్ది రోజుల్లోనే తాలిబన్ల పాలన ఎంత దారుణంగా ఉంటుందో ప్రపంచానికి తెలుస్తోంది. కాబుల్‌లో అడుగడుగునా మోహరించిన తాలిబన్లు విధ్వంసాలకు తెగబడుతున్నారు. ఇదిలావుంటే, అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్ల పాలనను తాము గుర్తించలేదని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు అర్సులా వాన్ డెర్ లియన్ తెలిపారు. తాలిబన్లతో ప్రస్తుతం ఎటువంటి చర్చలు జరపట్లేదని, అది అనవసరం కూడా అని ఆమె స్పష్టం చేశారు. అఫ్ఘానిస్థాన్ నుంచి తిరిగొచ్చిన ఐరోపా సమాఖ్య ఉద్యోగుల కోసం మాడ్రిడ్ నగరంలో ఏర్పాటు చేసిన…
కరోనా ప్యాండమిక్ లో ఎంతోమంది ఆపన్నులను ఆదుకున్న ప్రముఖ నటుడు సోనూ సూద్ మరోమారు తన మంచిమనసు చాటుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు ఆక్రమించుకోవడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అక్కడ ఎంతోమంది యుద్ధం కారణంగా నిరాశ్రయులైనారు. ఈ నేపథ్యంలో సోనూ సూద్ తనదైన రీతిలో స్పందించారు. తాలిబన్లతో పోరాటం సాగించిన ఆఫ్ఘన్ పట్టణాలలో జనజీవనం అతలాకుతలమైందని, అలాంటి వారిని ఆదుకోవలసిన బాధ్యత మనందరిపైనా ఉందని సోనూ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. అలాగే అక్కడ నివాసమున్న ఎంతోమంది…
తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లోకి అడుగుపెట్టిన తర్వాత.. అక్కడి భారత రాయభార కార్యాలయంలోని మొత్తం సిబ్బందిని భారత్‌కు తరలించారు అధికారులు.. అయితే, ఆఫ్ఘనిస్థాన్‌లో ఇప్పటికీ పెద్ద సంఖ్యలో భారతీయులు ఉన్నట్టుగా తెలుస్తోంది… సుమారు 1000 మంది భారతీయులు అక్కడే చిక్కుకున్నారు.. వారిలో సుమారు 200 మంది సిక్కులు, హిందువులు స్థానిక గురుద్వారలో తలదాచుకున్నట్లు సమాచారం. ఆప్ఘన్ లో ఉన్న భారతీయులతో సహా, తాలిబాన్ల చేతిలో బందీలుగా ఉన్న సుమారు 150 మంది భారతీయులను భారత్ కు తరలించేందుకు,…
వెనక్కి వెళ్ళే హడావుడిలో అమెరికా పెద్ద తప్పే చేసింది. తన ఆయుధ డంపులను అఫ్గాన్‌లోనే వదిలేసింది. ఈ నిర్లక్ష్యం తాలిబన్లకు వరంగా మారింది. సుల్తాన్‌ఖిల్ సైనిక స్థావరంలోని కంటైనర్ల కొద్దీ ఆయుధాలు, వాహనాలు తాలిబన్ల సొంతమయ్యాయి. అప్ఘాన్ సేన కోసం అమెరికా ఇరవైఏళ్లుగా అనేక ఆధునాతన ఆయుధాలను భారీగా సమకూర్చింది. అమెరికా భాగస్వామ్యంలో అందించిన బోలెడు ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో పాటు, ఎన్నో సైనిక మౌలిక వసతులు తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లిపోయాయి. ఇంతకాలం అందని వైమానిక సంపత్తి…
ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ మొత్తం తాలిబన్ల వశం అయింది. రాజధాని కాబూల్‌ను ఆక్రమించుకోవడంతో తాలిబన్లు పాలనలోకి ఆఫ్ఘనిస్తాన్ వెళ్లిపోయింది. రాజధానిలో అరాచకాలు జరుగుతున్నాయి. కాబూల్ ఎయిర్పోర్ట్ వద్ద తాలిబన్లు తెగబడుతున్నారు. ఎయిర్పోర్ట్ వైపు వెళ్తున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నారు. ఒకవైపు ఇలా ఉంటే, ఆఫ్ఘన్ ఆర్మీ పక్కకు తప్పుకున్నా, స్థానిక ప్రజలు ప్రత్యేక దళాలుగా ఏర్పడి తాలిబన్లతో పోరాటం చేస్తునన్నారు. బగ్లాన్ ప్రావిన్స్‌లోని స్థానిక దళాలు తాలిబన్లపై తీవ్రంగా పోరాటం చేస్తున్నాయి. స్థానిక దళాల చేతిలో అనేకమంది…
తాలిబన్లు ఎంతటి కర్కశకులో చెప్పనలివి కాదు. మానవత్వం మచ్చుకైనా కనిపించదు. జాలి, దయ అన్నవి వారి నిఘంటువులో కనిపించవు. తెలిసందల్లా రక్తపాతం సృష్టించడం, ప్రజలకు భయపెట్టడం. బయటిప్రజలతోనే కాదు, ఇంట్లోని భార్య, బిడ్డలతో కూడా వారి ప్రవర్తన అలానే ఉంటుంది. దీనికి ఎన్నో తార్కాణాలు ఉన్నాయి. అందులో ఒకటి ఇది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి నాలుగేళ్ల క్రితం చిన్న బిడ్డలను తీసుకొని పొట్ట చేత్తోపట్టుకొని ఇండియా వచ్చింది ఫరిభా అనే మహిళ. ఆఫ్ఘన్లో ఆమె ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నదో…