తాలిబన్లకు అన్ని విధాలుగా సహకరిస్తోంది పాకిస్థాన్. అఫ్ఘాన్ ఆర్మీతో పోరులో తాలిబన్లకు సహకరించాయి పాక్ ఉగ్రవాద సంస్థలు. అఫ్ఘాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్నాక POK తిరిగి వచ్చాయి ఆ ఉగ్రమూకలు. ఈ ఎక్స్‌క్లూజివ్ విజువల్స్ బయటకు వచ్చాయి. దీంతో తాలిబన్లకు.. తమ చెప్పుచేతల్లో ఉండే ఉగ్ర సంస్థల ద్వారా సహకారం అందించింది పాక్. పైకి అమెరికాకు సహకరిస్తున్నట్లే ఉన్నా.. లోలోపల మాత్రం తాలిబన్లకు సహకరించింది. ఈ విజువల్స్ ద్వారా.. పాక్ పన్నాగం బయటపడింది. ఉగ్రవాదులు తిరిగివచ్చినప్పుడు..లష్కరే తోయిబా,…
ఆఫ్ఘనిస్తాన్ మొత్తం తాలిబన్ల వశం అయినప్పటికీ ఉత్తర భాగంలో ఉన్న పంజ్‌షీర్ ప్రావిన్స్ మాత్రం వారికి దక్కలేదు. ఆ ప్రాంతం కోసం తాలిబన్లు పోరాటం చేస్తున్నారు. నిన్నటి రోజున జరిగిన పోరాటంలో 300 మంది తాలిబన్లను మట్టుబెట్టినట్టు పంజ్‌షీర్ ఫైటర్స్ పేర్కొన్నారు. పంజ్‌షీర్ ఫైటర్స్‌కు మాజీ ముజాహిదీన్ నేత అహ్మద్ షా కుమారుడితో పాటు, ఆఫ్ఘన్ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ నాయత్వం వహిస్తున్నారు. ఆఫ్ఘన్ రద్దుచేసిన సాయుధ సిబ్బందితో పాటుగా, స్థానికి మిలీషియా దళంతో కలిసి తాలిబన్లపై…
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ సహా చాలా ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు తాలిబన్లు.. అయితే, కాబూల్ ఎయిర్పోర్ట్ లాంటి ప్రాంతాల్లో ఇంకా అమెరికా సైన్యం ఆధీనంలోనే ఉన్నాయి… అ నేపథ్యంలో అమెరికాకు డెడ్‌లైన్ పెట్టారు తాలిబన్లు… ఆఫ్ఘన్ గడ్డపై నుంచి తమ బలగాలను వెనక్కి రప్పించేందుకు అమెరికా.. ఈ నెల 31వ తేదీ వరకు గడువును పెట్టింది.. అయితే, అమెరికా పెట్టుకున్న ఆ గడువు పెంచితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు తాలిబన్లు.. ఆగస్టు…
ఆఫ్ఘన్ రాజధాని కాబూల్‌ను సైతం స్వాధీనం చేసుకున్నాం.. ఇక, మాకు ఎదురేలేదు అని భావిస్తున్న తాలిబన్లకు గట్టి ఎదురుదెబ్బ తగులుతోంది.. ఆఫ్ఘనిస్థాన్‌లోని దక్షిణ ప్రాంతంలోని ఆండ్రాబ్ ప్రావిన్స్‌లో తాలిబాన్-ఆఫ్ఘన్ సైన్యం మధ్య భీకర యుద్ధమే నడుస్తోంది… తాలిబన్లు స్వాధీనం చేసుకోని కొన్ని ప్రాంతాల్లో పంజ్‌షీర్ లోయ ఒకటి కాగా.. ఆ ప్రాంతానికి వెళ్లిన తాలిబన్లకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది.. ఆంధ్రాబ్ ప్రావిన్స్‌లో జరిగిన పోరులో ఇప్పటి వరకు 50 మందికి పైగా తాలిబన్ ఫైటర్లు మరణించినట్టుగా తెలుస్తోంది……
అఫ్గానిస్థాన్ లో చోటు చేసుకున్న సంక్షోభం ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. ఆ దేశం తాలిబన్ల రాజ్యం కావటంతో అక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అయితే ఈ కారణంగా బాలీవుడ్ నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ అర్షి ఖాన్ తన నిశ్చితార్ధాన్ని రద్దుచేసుకొంది. ఈ ఏడాది అక్టోబర్‌లో అఫ్గనిస్తాన్ క్రికెటర్‌తో తన నిశ్చితార్థం జరగాల్సి ఉండగా, తన నిర్ణయాన్ని మార్చుకొంది. అయితే నిశ్చితార్థం బ్రేక్ అయినప్పటికీ మేమిద్దరం మంచి మిత్రులుగానే ఉన్నామని ఆమె తెలిపింది. కాగా, ఈ సంక్షోభం ద్వారా…
ఆఫ్ఘనిస్థాన్‌లో తాజా పరిణామాలు కలవర పెడుతున్నాయి.. ఇక, మరికొంత మంది భారతీయులు.. అక్కడ చిక్కుకోవడం ఆందోళనకు గురిచేస్తోంది.. ఈ నేపథ్యంలో ఆప్ఘన్ పరిణామాలపై దృష్టి సారించింది కేంద్ర ప్రభుత్వం.. ఈ నెల 26వ తేదీన అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది.. ఈ సమావేశంలో తాజా పరిస్థితిని విపక్షాలకు వివరించనుంది కేంద్ర ప్రభుత్వం.. ప్రధానంగా ఆఫ్ఘన్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడంపైనే కేంద్రం దృష్టిసారించినట్టుగా తెలుస్తోంది. ఆఫ్ఘన్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి.. ఇంకా ఎంతమంది భారతీయులు అక్కడ ఉన్నారు.. వారిని…
ప్రపంచం మొత్తం కరోనాతో టెన్షన్ పడుతుంటే, ఆఫ్ఘనిస్తాన్‌లో మాత్రం తాలిబన్లతో టెన్షన్ పడుతున్నది. తాలిబన్లు ఆక్రమణలతో ఆ దేశం ఇప్పుడు అయోయమ స్థితిలో పడిపోయింది. 1996 నుంచి 2001 వరకు ఆ దేశాన్ని తాలిబన్లు పరిపాలించిన సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదరుర్కొన్నారో అక్కడి ప్రజలు ఇంకా మర్చిపోలేదు. 12 ఏళ్లు దాటిన చిన్నారులు స్కూళ్లకు వెళ్లడంపై నిషేదం ఉన్నది. షరియా చట్టాల ప్రకారమే వారు పరిపాలిస్తుంటారు. ఇప్పుడు సుపరిపాలన అందిస్తామని, మహిళల హక్కులు గౌరవిస్తామని చెబుతున్నా వారి…
ఆఫ్ఘనిస్తాన్లోని పంజ్‌షీర్ ప్రావిన్స్‌లో మళ్లీ ఉద్రికత్తలు చోటు చేసుకున్నాయి. పంజ్‌షీర్ ప్రావిన్స్ ఇప్పటి వరకు తాలిబన్ల వశం కాలేదు. ఆ ప్రావిన్స్‌లోకి అడుగుపెట్టనివ్వబోమని అక్కడి సైన్యం చెబుతున్నది. అయితే, ఎలాగైనా ఆక్రమించుకోవాలని తాలిబన్లు పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో పంజ్‌షీర్‌లో తిరుగుబాటుదారుల కోసం తాలిబన్లు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. దీంతో పంజ్‌షీర్ సైన్యం తాలిబన్లపై విరుచుకుపడింది. పంజ్‌షీర్ సైన్యం దాడిలో 300 మంది తాలిబన్లు హతం అయినట్టు సైన్యం ప్రకటించింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా కూడా…
ఎప్పుడైతే అమెరికా తన బలగాలను ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిందో అప్పటి నుంచి తాలిబన్లు రెచ్చిపోవడం మొదలుపెట్టారు. అతి తక్కువ సమయంలోనే తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను తమ ఆదీనంలోకి తెచ్చుకున్నారు. ఈ నెలాఖరు వరకు ఆమెరికా పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వైదొలగనున్నది. ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా దళాలు ఉన్నప్పుడే తాలిబన్లు వివిధ మార్గాల ద్వారా భారీ ఆదాయాన్న సమకూర్చుకున్నారు. ఇప్పుడు అమెరికా దళాలు తప్పుకుంటే తాలిబన్ల ఆదాయం మరింతగా పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. తాలిబన్లకు…