తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకోవడంతో అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకొని పారిపోతున్నారు. తాలిబన్ల పాలనలో ప్రజలు ఎంతటి దుర్భర పరిస్థితులను అనుభవించాల్సి వస్తుందో చెప్పాల్సిన అవసరం లేదు. మధ్యయుగంనాటి చట్టాలను అమలు చేస్తారు. మహిళల పట్ల చులకనభావం పెరుగుతుంది. ఇది ఒవపైపైతే, మరోవైపు వాణిజ్యం. ఇప్పటి వరకు అంతా సవ్యంగా సాగిన వాణిజ్య వ్యాపారాలు ఒక్కసారిగా కుదేలయ్యాయి. వివిధ దేశాలతో వాణిజ్యాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఇండియాలో వాణిజ్యసంబంధాలను నిలిపేయడంతో ఆ ప్రభావం ఇండియాలోని కొన్నింటిపై ప్రభావం చూపే అవకాశం ఉన్నది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి డ్రైఫ్రూట్స్‌ను దిగుమతి చేసుకుంటారు. ఈ డ్రైఫ్రూట్స్‌ను బిర్యానీలో వినియోగిస్తారు. హైదరాబాద్ బిర్యానీలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి దిగుమతి చేసుకునే డ్రైఫ్రూట్స్‌ను వినియోగిస్తుంటారు. అయితే, ఇప్పుడు దిగుమతి ఆగిపోవడంతో బిర్యానీ ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Read: ఎట్టకేలకు నెరవేరిన కాశ్మీరీ వాసుల కల… దాల్ సరస్సులో…