ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకునే ముందు రోజే అధ్యక్షుడు ఆష్రఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయాడు. సంచుల నిండా ధనం, కార్లతో ఆయన దేశం విడిచి హెలికాఫ్టర్‌లో వేరే దేశానికి వెళ్లిపోయాడు. అయితే, ఆయన ఏ దేశంలో ఉన్నాడు అన్నది బయటకు రాలేదు. తాజాగా మాజీ అధ్యక్షుడు ఆష్రఫ్ ఘనికి యూఏఈ ఆశ్రయం ఇచ్చినట్టు పేర్కొన్నది. మానవతా దృక్పదంతో ఘనీకి ఆశ్రయం ఇచ్చినట్టుగా ఆ దేశం తెలియజేసింది. అయితే, ఘని ఏ నగరంలో ఉన్నారో, ఏ ప్రాంతంలో…
తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారంలోకి వచ్చిన వెంటనే పాక్ అక్కడ కొత్తగా ఏర్పాటు చేసే ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని ప్రకటించింది. ఒకవైపు కొత్త ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని చెబుతూనే, ఆఫ్ఘనిస్తాన్-పాక్ సరిహద్దుల్లో 2600 కిలోమీటర్ల మేర అత్యంత వేగంగా ఇనుప కంచెను నిర్మించింది. 2 మీటర్ల వెడల్పు, 3.6 మీటర్ల ఎత్తులో కంచెను నిర్మించింది. అంతేకాదు, ఈ సరిహద్దు వెంట 1000 చెక్ పోస్టులు, ఇన్ఫ్రారెడ్ కెమెరాలను ఏర్పాటు చేసింది. కేవలం 16 ప్రాంతాల నుంచి మాత్రమే…
2001లో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు అధికారంలో ఉండగా బమియన్ లోని బుద్ధుని భారీ విగ్రహాన్ని పేల్చివేసిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు అదే బమియన్లోని హజారా జాతి నాయకుడు అబ్దుల్ అలీ మజారీ విగ్రహాన్ని బాంబులతో పేల్చివేశారు. హజారా జాతికి చెందిన వ్యక్తులు అప్పట్లో తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. హజరాజత్ అనే పర్వత ప్రాంతాల్లో నివశించే ప్రజలను హజారాలు అని పిలుస్తారు. మంగోల్ సామ్రాజ్యస్థాపకుడు ఛెంగిజ్ ఖాన్ వారసులు. 13 వ శతాబ్ధం నుంచి ఈ…
1994లో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకోవడానికి చాలా కష్టపడ్డారు. అమెరికా, నాటో దళాలు తాలిబన్లపై యుద్దం ప్రకటించిన తరువాత తాలిబన్లు వేగంగా వైదొలిగారు. 20 ఏళ్లు ప్రజాస్వామ్య పాలన సాగింది. ఎప్పుడైతే ఆఫ్ఘన్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆమెరికా ప్రకటించిందో అప్పటి నుంచి తాలిబన్లు ఒక్కొక్క ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టారు. కేవలం పది నుంచి 15 రోజుల వ్యవధిలోనే ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని వెనుక సరా ఖేటా అనే దళం ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఫష్తో…
అఫ్ఘానిస్థాన్‌లో యుద్ధం సంపూర్ణంగా ముగిసిందని తాలిబన్లు తాజాగా ప్రకటించారు. అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశం విడిచి పారిపోవడం పట్ల.. అఫ్ఘాన్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. పాశ్చాత్య దేశాలు తమ సిబ్బందిని వేగంగా స్వదేశానికి తరలించేందుకు ప్రస్తుతం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. తాలిబన్ల ధాటికి ప్రభుత్వ సేనలు చెల్లాచెదురవడంతో.. ఊహించిన దానికంటే ముందుగానే అఫ్ఘానిస్థాన్.. తాలిబనిస్థాన్ గా మారింది. 20 ఏళ్లుగా జరుగుతున్న పోరాటాన్ని తాలిబన్లు పది రోజుల్లోనే ముగించారు. ఒకటొకటిగా అఫ్ఘానిస్తాన్‌లోని కీలక పట్టణాలన్నింటినీ…
ఇప్పుడు ప్రపంచం మొత్తం తాలిబన్ల గురించే మాట్లాడుకుంటున్నారు. 1970 దశకం నుంచి మొజాహిదీన్లు ఆఫ్ఘన్లో అధికారం కోసం పోరాటం చేస్తున్నారు. ఆ తరువాత మొజాహిదీన్ల నుంచి తాలిబన్ సంస్థ ఆవిర్భవించింది. 1996లో తాలిబన్లు ఆఫ్ఘన్లో అధికారంలోకి వచ్చారు. నాలుగేళ్ల వారి పాలనలో ఆ దేశంలోని ప్రజలు ఎన్ని నరకయాతనలు అనుభవించారో చెప్పాల్సిన అవసరం లేదు. 2001 తరువాత తాలిబన్లను యూఎస్ సైన్యం తరిమికొట్టి ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేశారు. అయితే, ఎప్పుడు మరోసారి తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్నారు. మరోసారి…
తాలిబన్లు కాబూల్‌ను ఆక్రమించుకోవడంతో ఆఫ్ఘనిస్తాన్ మొత్తం వారి సొంతం అయింది. ఆక్రమించుకున్న వెంటనే అంతా బాగుంటుందని ప్రకటించారు. కానీ వారి మాటలను ఎవరూ నమ్మడంలేదు. కాబూలో తో పాటుగా కొన్ని ప్రాంతాలను ఈజీగా ఆక్రమించుకున్నా, కొన్ని ప్రాంతాల్లో మాత్రం తాలిబన్లు తీవ్రంగా పోరాటం చేయాల్పి వచ్చింది. అలాంటి వాటిల్లో ఒకటి చాహర్ కింట్ జిల్లా. ఈ జిల్లాకు సలీమా మజారీ అనే మహిళ మేయర్‌గా పనిచేస్తున్నది. తాలిబన్లు చేస్తున్న దండయాత్రను ఆమె సమర్ధవంతంగా ఎదుర్కొన్నది. దేశంలోని వివిధ…
అమెరికాతో వ్యవహారం రెండు వైపులా పదునైన కత్తిలాంటిదనే వ్యవహరం మరోసారి రుజువైంది . అమెరికా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంతో భారత్ ఎంతో వ్యూహాత్మంగా చబహార్ పోర్టుపై పెట్టిన పెట్టుబడి వృథా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి . ఆల్టర్నేట్ మిడిల్ ఈస్ట్ ఏషియా , యూరప్ దేశాలతో నేల మార్గం ద్వారా జరిగే వ్యాపారం ఇప్పటి వరకు ఎక్కువగా పాకిస్తాన్ మీదుగా జరుగుతోంది. దీంతో పాకిస్తాన్‌పై ఎక్కువగా ఆధారపడకుండా ఉండేందుకు ప్రత్యామ్నయంగా ఇరాన్లో చబహార్ పోర్టును అభివృద్ధి చేసేందుకు…