తాలిబన్ల అరచకాలు మేం భరించలేం అంటూ ఆఫ్ఘనిస్థాన్‌ను వదిలి వెళ్లేందుకు ప్రజలు పోటీ పడుతున్నారు.. దీంతో.. ఎయిర్‌పోర్ట్‌లకు తాకిడిపెరిగిపోయింది.. ఇక, ఆయా దేశాలను తమ దేశానికి చెందిన పౌరులను స్వదేశానికి తరలించేందుకు చర్యలను పూనుకుంటున్నాయి.. అందులో భాగంగా.. కాబూల్ నుంచి భారత వైమానిక దళానికి చెందిన -17 విమానం ఇవాళ భారత్‌కు చేరుకుంది… ఈ విమానంలో 168 మంది భారత్‌కు చేరుకున్నారు. కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి బయలు దేరిన విమానం.. ఇవాళ ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో ల్యాండ్ అయ్యింది. ఈ విమానంలో 107 మంది భారతీయులతో సహా మొత్తం 168 మంది ఉన్నారు. ఇక, భారతీయ దౌత్యవేత్తలు, అధికారులు, భద్రతా సిబ్బంది భారత్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే… మరోవైపు.. ఆఫ్ఘనిస్థాన్‌లో వెయ్యి మందికి పైగా భారతీయులు ఉన్నట్టుగా తెలుస్తోంది.. వీరిని క్రమంగా స్వాదేశానికి తరలించేందుకు రోజుకు రెండు విమానాలను నడిసేందుకు సిద్ధం అవుతున్నారు అధికారులు.