ఆఫ్ఘనిస్థాన్‌లో తాజా పరిణామాలు కలవర పెడుతున్నాయి.. ఇక, మరికొంత మంది భారతీయులు.. అక్కడ చిక్కుకోవడం ఆందోళనకు గురిచేస్తోంది.. ఈ నేపథ్యంలో ఆప్ఘన్ పరిణామాలపై దృష్టి సారించింది కేంద్ర ప్రభుత్వం.. ఈ నెల 26వ తేదీన అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది.. ఈ సమావేశంలో తాజా పరిస్థితిని విపక్షాలకు వివరించనుంది కేంద్ర ప్రభుత్వం.. ప్రధానంగా ఆఫ్ఘన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడంపైనే కేంద్రం దృష్టిసారించినట్టుగా తెలుస్తోంది. ఆఫ్ఘన్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయి.. ఇంకా ఎంతమంది భారతీయులు అక్కడ ఉన్నారు.. వారిని…
ప్రపంచం మొత్తం కరోనాతో టెన్షన్ పడుతుంటే, ఆఫ్ఘనిస్తాన్‌లో మాత్రం తాలిబన్లతో టెన్షన్ పడుతున్నది. తాలిబన్లు ఆక్రమణలతో ఆ దేశం ఇప్పుడు అయోయమ స్థితిలో పడిపోయింది. 1996 నుంచి 2001 వరకు ఆ దేశాన్ని తాలిబన్లు పరిపాలించిన సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదరుర్కొన్నారో అక్కడి ప్రజలు ఇంకా మర్చిపోలేదు. 12 ఏళ్లు దాటిన చిన్నారులు స్కూళ్లకు వెళ్లడంపై నిషేదం ఉన్నది. షరియా చట్టాల ప్రకారమే వారు పరిపాలిస్తుంటారు. ఇప్పుడు సుపరిపాలన అందిస్తామని, మహిళల హక్కులు గౌరవిస్తామని చెబుతున్నా వారి…
ఆఫ్ఘనిస్తాన్‌లోని పంజ్‌షీర్ ప్రావిన్స్‌లో మళ్లీ ఉద్రికత్తలు చోటు చేసుకున్నాయి. పంజ్‌షీర్ ప్రావిన్స్ ఇప్పటి వరకు తాలిబన్ల వశం కాలేదు. ఆ ప్రావిన్స్‌లోకి అడుగుపెట్టనివ్వబోమని అక్కడి సైన్యం చెబుతున్నది. అయితే, ఎలాగైనా ఆక్రమించుకోవాలని తాలిబన్లు పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో పంజ్‌షీర్‌లో తిరుగుబాటుదారుల కోసం తాలిబన్లు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. దీంతో పంజ్‌షీర్ సైన్యం తాలిబన్లపై విరుచుకుపడింది. పంజ్‌షీర్ సైన్యం దాడిలో 300 మంది తాలిబన్లు హతం అయినట్టు సైన్యం ప్రకటించింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా కూడా…
ఎప్పుడైతే అమెరికా తన బలగాలను ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిందో అప్పటి నుంచి తాలిబన్లు రెచ్చిపోవడం మొదలుపెట్టారు. అతి తక్కువ సమయంలోనే తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను తమ ఆదీనంలోకి తెచ్చుకున్నారు. ఈ నెలాఖరు వరకు ఆమెరికా పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వైదొలగనున్నది. ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా దళాలు ఉన్నప్పుడే తాలిబన్లు వివిధ మార్గాల ద్వారా భారీ ఆదాయాన్న సమకూర్చుకున్నారు. ఇప్పుడు అమెరికా దళాలు తప్పుకుంటే తాలిబన్ల ఆదాయం మరింతగా పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. తాలిబన్లకు…
తాలిబన్లకు బగ్లాన్ ప్రావిన్స్ కొరకరాని కొయ్యగా మారింది. 2001 కి ముందు కూడా ఈ ప్రావిన్స్‌లోకి తాలిబన్లు అడుగుపెట్టకుండా అప్పటి స్థానిక దళాలు అడ్డుకున్నాయి. తీవ్రంగా పోరాటం చేశాయి. ఇప్పుడు కూడా ఈ ప్రావిన్స్‌లోకి అడుగుపెట్టనివ్వకూడదని స్థానిక దళాలు నిర్ణయం తీసుకొని పోరాటం చేస్తున్నాయి. ఇప్పటికే మూడు జిల్లాలను తాలిబన్ల చెర నుంచి విడిపించారు. అయితే, తాలిబన్లు కాబూల్ ఆక్రమణ తరువాత శాంతిని కోరుకుంటున్నామని, అందరినీ క్షమించివేశామని చెబుతున్నారు. అయినప్పటికీ తాలిబన్ల మాటలను అక్కడి ప్రజలెవరూ కూడా…
ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. తాలిబన్ల ఆక్రమణలతో ప్రజలు భీతిల్లిపోతున్నారు. ఎటునుంచి ఎవరు దాడులు చేస్తారో అని ప్రాణాలు గుప్పిట పట్టుకొని దొరికిన విమానం పట్టుకొని దేశం విడిచి పారిపోతున్నారు. సామాన్యులతో పాటుగా ఆఫ్ఘన్ నేతలు కూడా వివిధ దేశాలకు పారిపోతున్నారు. గత ప్రభుత్వంలోని నేతలను ఏమి చేయబోమని తాలిబన్లు హామీ ఇస్తున్నా, వారి హామీలను ఎవరూ నమ్మేస్థితిలో లేరనే సంగతి తెలిసిందే. ఇలా ఆఫ్ఘన్ నుంచి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని వచ్చిన ఎంపీ నరేందర్ సింగ్…
2001 నుంచి ఇరవై ఏళ్లపాటు అమెరికా లక్షల కోట్ల రూపాయలను ఆఫ్ఘనిస్తాన్‌లో సైన్యం కోసం పెట్టుబడులు పెట్టింది. విలువైన, అధునాతనమైన ఆయుధాలు సమకూర్చింది. అయినప్పటికీ కేవలం 11 రోజుల్లోనే ఆఫ్ఘన్ సేనలు తాలిబన్లకు లొంగిపోయారు అంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకొవచ్చు. మూడు లక్షలకు పైగా ఆఫ్ఘన్ సేనలు ఉన్నాయని, వారంతా బలంగా ఉన్నారని, అమెరికా సైన్యం వారికి అద్భుతమైన శిక్షణ ఇచ్చిందని సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. ఆయన చెప్పిన దానికి, అక్కడ…
తాలిబన్లను ప్రపంచమంతా అరాచక శక్తిగానే చూస్తోంది. అఫ్ఘానిస్థాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో అక్కడి మహిళలు బిక్కుబిక్కుమని జీవిస్తున్నారు. అక్కడ పరిస్థితి అంత దారుణంగా పాకిస్థాన్‌లో మాత్రం తాలిబన్లను కీర్తిస్తున్నారు. తాలిబన్ల విపరీత చేష్టల్ని పొగుడుతూ బాలికలతో పాటలు పాడిస్తున్నారు పాకిస్థాన్ ఛాందసవాదులు. ఇస్లామాబాద్‌లోని మహిళల మదర్సాలో తాలిబన్లను పొగుడుతూ పాటలు పాడారు బాలికలు. జామియా హఫ్సాకు చెందిన లాల్ మసీద్ వద్ద తాలిబన్లకు మద్దతుగా సమావేశం జరిగింది. ఆ ప్రాంతంలో తాలిబన్ల జెండాలు కట్టారు. పాకిస్థాన్‌లో కూడా…