కాబూల్ విమానాశ్రయం వద్ద ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. గత వారం రోజులుగా అమెరికాతో సహా అనేక దేశాలు తమ పౌరులను, ఆఫ్ఘనిస్తాన్ పౌరులను వివిధ దేశాలకు తరలిస్తున్నాయి. తాలిబన్ల భయంలో ఆఫ్ఘన్ ప్రజలు వివిధ దేశాలకు తరలివెళ్తున్నారు. ఎలాగైనా ప్రాణాలు కాపాడుకోవాలని చూస్తున్నారు. అయితే, గత రెండు రోజులుగా కాబూల్ నగరం నుంచి ఎయిర్‌పోర్ట్ వైపు వెళ్లేవారిపై తాలిబన్లు దృష్టిసారించారు. ఎయిర్‌పోర్టువైపు వెళ్తున్న వారిపై దాడులు చేస్తున్నారు. కాల్పులు జరుపుతున్నారు. తాజాగా ఈరోజు మరోసారి తాలిబన్లు కాల్పులకు తెగబడ్డారు. ఎయిర్‌పోర్టు వద్ద గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు మొదలయ్యాయి. తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట కారణంగా ఏడుగురు మృతిచెందినట్టు బ్రిటన్ రక్షణ అధికారులు పేర్కొన్నారు. కాబూల్ ఎయిర్‌పోర్ట్ వద్ద ప్రస్తుతం పరిస్థితులు దారుణంగా మారిపోవడంతో అటువైపు ఎవరూ రావొద్దని, పరిస్థితులు అదుపులోకి వచ్చేవరకు ప్రజలు వారి ఇండ్లలోనే ఉండాలని అమెరికా ఆర్మీ అధికారులు చెబుతున్నారు.
Read: ఆ విమానంలో 640 మంది కాదు… అంతకు మించి…