తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి గ్రూపులు, అంతర్గత కలహాలు, కుమ్ములాట ఇలా ఏవీ కొత్త కాదు.. సందర్భాలను బట్టి అంతర్గత విభేదాలు బయట పడుతూనే ఉన్నాయి.. తాజాగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలైంది.. కొత్త కమిటీలు వివాదానికి దారితీస్తున్నాయి… ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో మండల కమిటీల మార్పిడితో పాత క్యాడర్‌లో ఆందోళన మొదలైంది.. ఈ పరిణామంపై పాత క్యాడర్ ఆగ్రహంగా ఉంది. ఇదంతా మహేశ్వర్ రెడ్డి వర్గం పనే అంటున్న మండిపడుతోంది ప్రేమ్ సాగర్…
తెలంగాణలో చిరుతలు అలజడి కలిగిస్తున్నాయి. ప్రతి రోజూ ఏదో ఒక జిల్లాలో చిరుతలు నడిరోడ్లపైకి, వ్యవసాయ క్షేత్రాల్లోకి వస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా, కల్హేరు మండలం నగాధర్ శివారులో చిరుత పులి తిరుగుతున్నట్టు రైతులు తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన చిరుత పులి కదలికలను రైతులు విడుదల చేయడంలో సమీపంలోని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. రైతు రామయ్య కు చెందిన లేగదూడను చంపేసింది ఆ చిరుత పులి. కల్హేరు సిర్గాపూర్…
గత కొంత కాంలంగా రాష్ట్రంలో పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజన రైతులపై అనేక సార్లు అటవీఅధికారులు దాడికి పాల్పడ్డారు. ఇదే సమయంలో తమకు భూమి హక్కు పత్రాలు ఇవ్వాలని రైతులు ఎన్నో సార్లు ప్రభుత్వానికి మొర పెట్టుకున్నారు. తాజాగా శనివారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నేతృత్వంలో పోడు రైతుల సమస్యలను పరిష్కరించేందుకు అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, అధికారులు అఖిల పక్ష నాయకులు పాల్గొన్నారు.…
పోడు రైతులకు భూమి హక్కు పత్రాలు ఇవ్వాలని తెలంగాణ వచ్చినప్పటి నుంచి గిరిజనులు కోట్లాడుతున్న ప్రభుత్వం ఆదిశగా అడుగులు వేయలేదు. ఎన్నో సార్లు పోడు భూములపై ఇటు ఫారెస్ట్ అధికారులకు, గిరిజనులకు మధ్య వాగ్వివాదం నడిచింది. కొన్ని సార్లైతే జైలుకు వెళ్లాల్సి వచ్చింది. గత కొన్ని రోజుల కిందట ఖమ్మంలోని కారేపల్లిలో పోడు సాగు చేస్తున్నందుకు అడ్డుకున్న బాలింత మహిళలపై అధికారులు కేసులు పెట్టి జైలుకు పంపించారు. దీనిపై హ్యుమన్‌రైట్ కమిషన్, పలు మహిళా సంఘాలు సీరియస్…
ఉదయాన్నే ఆ ఊరికి చెందిన కొందరు వ్యక్తులు రోడ్డు పక్కన నిలబడి ఆటోలు ఆపుతుంటారు. ఆటో ఆగిన తరువాత ఆటో డ్రైవర్‌తో మాట్లాడుతారు. ఆ తరువాత అందులోని వ్యక్తులను తీసుకొని వెళ్తారు. ఎవరు వారంతా, ఎందుకు తీసుకెళ్తున్నారు. ఎక్కడికి తీసుకెళ్తారు అనే అనుమానాలు రావొచ్చు. ఆదిలాబాద్ జిల్లాలోని తాంసీ మండలంలో పొన్నారి అనే గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో పత్తిపంట చేతికి వచ్చిన తరువాత పత్తిని తీసేందుకు కూలీల కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదిలాబాద్ చుట్టుపక్కల…
గెల్చిన ఎమ్మెల్యే.. ఓడిన అభ్యర్థి ఇద్దరూ ప్రస్తుతం ఒకే పార్టీ. ఎవరి పదవి వాళ్లదే. అంతా బాగానే ఉన్నా.. వచ్చే ఎన్నికల్లో ఎవరికి అసెంబ్లీ టికెట్ ఇస్తారు? సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఛాన్స్ ఉంటుందా? లేక ముందు నుంచీ పార్టీలో ఉన్న నేతను పిలుస్తారా? ఈ అంశం చుట్టూనే ఆసిఫాబాద్‌లో వాడీ వేడీ చర్చ జరుగుతోందట. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఆసిఫాబాద్ టీఆర్‌ఎస్‌లో ఆధిపత్యపోరు..! ఈయన పేరు ఆత్రం సక్కు. కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే. 2018లో…
పార్టీ కమిటీల ఎంపికకు ముందే అధికారపార్టీ ఎమ్మెల్యేల మధ్య లొల్లి మొదలైందా? జిల్లాస్థాయి పదవులను తమ నియోజకవర్గానికే కేటాయించేలా ఎత్తుగడలు వేస్తున్నారా? ఈ విషయంలో ఎవరికి వారు చక్రం తిప్పుతున్నారా? ఇంతకీ ఏంటా పదవి? ఏమా గొడవ? అనుచరులకు పదవులు కట్టబెట్టే యత్నం? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాలుగు ముక్కలైన తర్వాత.. ఏర్పాటవుతున్న టీఆర్‌ఎస్ కమిటీలకు నలుగురు జిల్లా అధ్యక్షులు రాబోతున్నారు. ఈ విషయంలో జిల్లాల్లో కీలకంగా ఉన్న నాయకులు తెరవెనక పెద్ద మంత్రాంగమే నడుపుతున్నారట. మంత్రి…
అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామంటారు అధికారులు. కుదరదని అడ్డంగా కూర్చుంటారు స్థానిక ప్రజాప్రతినిధులు. ఏం చేయాలో.. ఎవరికి సర్దిచెప్పాలో తెలియక తలపట్టుకుంటున్నారు అధికారపార్టీ ఎమ్మెల్యేలు. మున్సిపాలిటీల నుంచి ఫోన్లు వస్తే ఎమ్మెల్యేలకు హడల్ అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. ఆ సంగతేంటో ఈ స్టోరీలో చూద్దాం. అక్రమ నిర్మాణాలను కూల్చివేయకుండా స్థానిక ప్రజాప్రతినిధులు ధర్నాలు! ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయాలని మున్సిపల్ అధికారులు నిర్ణయించారు. జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, లక్సెట్టిపేట, క్యాతన్‌పల్లి, నస్పూర్, చెన్నూరు,…
రేపు జరుగబోయే ఇంద్రవెల్లి దండోరా సభకు హాజరు కాలేకపోతున్నానంటూ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. సభకు హాజరుకాలేదని ఎవరు తప్పుడు ప్రచారం చెయ్యెద్దని.. ముందుగానే వివరణ ఇస్తున్నాను అని జగ్గారెడ్డి చెప్పారు. గతం వారం రోజులుగా జ్వరంగా ఉంది. అందుకే కోర్ట్ కు కూడా హాజరు కాలేకపోయాను. వారెంట్ కూడా వచ్చింది. ఈ కారణంగానే సోమవారం జరగనున్న ఇంద్రవెల్లి దండోరా సభకు హాజరు కాలేకపోతున్నానని తెలిపారు. సమన్వయకర్తగా సభ ఏర్పాట్లపై ఇప్పటికే పలుమార్లు చర్చించానని వివరించారు. ఉమ్మడి ఆదిలాబాద్…