ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు తథ్యమని తాను ముందే చెప్పానని లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు అన్నారు. తాతా మధు గెలిచిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.. తాతా మధుని అత్యధిక మెజార్టీతో గెలిపించిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక సంస్థల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సీఎ కేసీఆర్ పాలన, యువ నేత, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో టీఆర్‌ఎస్ ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారన్నారు. దేశానికి అన్నం పెట్టే…
తెలంగాణలో చలి చంపేస్తోంది. ఉదయం 8 గంటలైనా రోడ్డుమీదికి రావాలంటేనే జనం వణికిపోతున్నారు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇప్పటికే చలి తీవ్రత బాగా పెరిగిపోయింది. దాంతో గజగజ వణికి పోతుంది ఏజెన్సీ. కొమురం భీం జిల్లా సిర్పూర్ యూలో 10.4 డిగ్రీలు గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా అర్లిటిలో 10.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకాగా… బేలాలో 10.9 గా కనిష్ట ఉష్ణోగ్రతలు… గిన్నేదరీ లో 10.9… చెప్రాల…
చలికాలం తీవ్రరూపం దాలుస్తోంది. తెలంగాణలో చలి తన విశ్వరూపం చూపిస్తోంది. డిసెంబర్ రెండవ వారంలోనే పరిస్థితి ఇలా వుంటే.. రాను రాను వాతావరణం మరింత చల్లగా మారుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రత పెరుగుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. కొమురం భీం జిల్లా సిర్పూర్ యూ లో 13.1 గా కనిష్ట ఉష్ణోగ్రత లు నమోదయ్యాయి. గిన్నె దరిలో 13.6 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా సోనాలలో 13.1 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు…
తెలంగాణలోని ఐదు జిల్లాల పరిధిలో ఆరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరుగుతుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. కరీంనగర్‌లో రెండు, ఆదిలాబాద్, నల్గొండ, మెదక్, ఖమ్మం జిల్లాలో ఒక్కో స్థానానికి గానూ మొత్తం 26 మంది పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాలో ఏర్పాటు చేసిన 37 పోలింగ్ కేంద్రాల్లో 5,326 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని పోలింగ్…
లీడర్స్ ఫర్ సేల్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తున్న మాట. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొందరు నాయకులు అమ్ముడు పోయారనే ఆరోపణలు రచ్చ రచ్చ చేస్తున్నాయి. ఎవరు బాగోతం ఏంటో తెలుసుకునేందుకు.. ఏకంగా లై డిటెక్టర్ పరీక్షలకు సవాళ్లు విసురుకుంటున్నారు. ఆ సంగతేంటో ఈ స్టోరీలో చూద్దాం. కాంగ్రెస్, బీజేపీ మధ్య సోషల్ మీడియాలో వార్..! ఎన్నికలంటేనే.. బోల్డంత డబ్బు ఖర్చుపెట్టాలి. ఓటర్లకు పంచడం ఎలా ఉన్నా.. ప్రత్యర్థులను దారిలోకి తెచ్చుకునేందుకు నోట్ల కట్టలతో కొడతారు. దీపం…
దేశంలో కరోనా వ్యాక్సిన్లు యుద్ధ ప్రాతిపదికన వేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు బామ్మలు సమ్ థింగ్ స్సెషల్ గా నిలిచారు. వ్యాక్సిన్ వేయించుకోవడంలో ఔరా అనిపించారు. జిల్లాలో కరోనా టీకా తీసుకున్నారు ఈ ఇద్దరు వందేళ్ల వృద్ధులు. భీం పూర్ మండలం తాంసీ కే కు చెందిన వాంకడే తాను బాయి, గాదిగూడకు చెందిన సాబ్లే కమలా బాయిలు కరోనా వ్యాక్సిన్ వేయించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. వీరి వయసు 100కు పైమాటే. ఈ వయసులోనూ ఎంతో బాధ్యతగా,…
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు కాకరేపుతున్నాయి. మెజారిటీ స్థానాల్లో అధికార పార్టీ హవా కొనసాగినా, ఒకటి రెండుచోట్ల రచ్చ జరుగుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో గోనే ప్రకాశ్ రావు మీడియా సమావేశం నిర్వహించడం హాట్ టాపిక్ అవుతోంది. ఆదిలాబాద్ లో నామినేషన్ల ఉపసంహరణ పై హోంమంత్రి అమిత్ షా కు ఫిర్యాదుచేస్తానన్నారు గోనె. నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించిన సీసీ పుటేజీ ఇవ్వాలని కలెక్టర్ సిక్తాపట్నాయక్ ని కోరారు. సమాచార హక్కు చట్టం క్రింద నామినేషన్లు ఉపసంహరణకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని…
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాంప్ రాజకీయాలకు తెరలేపుతున్నారు రాజకీయ నేతలు.. తెలంగాణ కొన్ని స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవంగా అధికార టీఆర్ఎస్ పార్టీ ఖాతాలో పడిపోగా.. మిగతా స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.. ఆదిలాబాద్ ఎమ్మెల్సీ స్థానంలో ఇద్దరు అభ్యర్థులు బరిలో ఉండడంతో.. పోటీ అనివార్యం అయ్యింది. ఈ నేపథ్యంలో తమ ప్రజాప్రతినిధులు చేజారకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు.. అందులో భాగంగా ఆదిలాబాద్‌లో అధికార పార్టీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను క్యాంప్‌కు తరలించేందుకు సిద్ధం అయ్యింది……
చలి చంపేస్తోంది. ఉదయం 8 గంటలైనా రోడ్డుమీదికి రావాలంటేనే జనం వణికిపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పెరుగుతున్న చలితో జనం ఇబ్బందిపడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ లో 11 .3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొమురం భీం జిల్లా సిర్పూర్ లో 11.4 డిగ్రీలు, గిన్నేదారిలో 11 .5 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా బేలలో 11.5 డిగ్రీలు, నిర్మల్ జిల్లా పెంబి లో 12 .7 డిగ్రీలు…
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల గురించి చీఫ్ ఎలక్ర్టోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆదిలాబాద్ 8 పోలింగ్ స్టేషన్లు మొత్తం 937 ఓటర్లు ఉన్నారన్నారు. ఆదిలాబాద్‌లో ఒక్కో స్థానానికి ఇద్దరూ అభ్యర్థులు బరిలో ఉన్నారన్నారు. కరీంనగర్‌లో 8 పోలింగ్ స్టేషన్లు ఉండగా, 1324 ఓటర్లు ఉన్నారు. 2 ఎమ్మెల్సీ స్థానాలకు 10 మంది బరిలో ఉన్నట్టు తెలిపారు. మెదక్ 9 పోలింగ్…