డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ఇటీవల రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయి. అమాయకులు ఈ ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో వాహనంతో ఢీకొట్టి ఈడ్చుకుపోతున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ కంటైనర్ డ్రైవర్ బైకును ఢీకొట్టి 3 కి.మీలు లాక్కెళ్లాడు. మానవత్సం మరిచి వాహనాన్ని ఆపకుండా 3 కి.మీ. ద్విచక్ర వాహనాన్ని ఈడ్చుకెళ్లింది కంటెయినర్. కంటైనర్ ముందు భాగంలో బైక్ ఇరుక్కుపోయింది. మావల బైపాస్ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. తలమడుగు మండలం దహేగాం…
డబుల్ బెడ్రూమ్, ఇందిరమ్మ ఇళ్ళు ఆ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టాయా? పాత, కొత్త పోరాటం మళ్ళీ మొదలైందా? ముందొచ్చిన చెవులకన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్న సామెతను గుర్తు చేస్తూ…. పాత కాంగ్రెస్ నాయకులు ఫీలైపోతున్నారా? ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యేకి ఇవేం పట్టడం లేదా? ఎక్కడ జరుగుతోందా వర్గపోరు? దాని మూలాలు ఎక్కడున్నాయి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డబుల్ బెడ్రూం, ఇందిరమ్మ ఇళ్ళ పంచాయితీ తీవ్రమవుతోంది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతల మధ్యనే……
ఆ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోందా? డీసీసీ అధ్యక్షుల విషయంలో పార్టీ నాయకత్వం పెట్టిన రూల్స్‌ని పక్కాగా ఫాలో అయితే… చివరికి అభ్యర్థులు కూడా దొరకరా? కొండ నాలుక్కి మందేయబోతే… ఉన్న నాలుకే ఊడే పరిస్థితులు వచ్చాయా? ఏంటా రూల్స్? ఏయే జిల్లాల్లో ఉందా పరిస్థితి? ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి వింత పరిస్థితి ఎదురవుతోందట. డీసీసీ అధ్యక్షుల ఎంపిక కత్తి మీద సాములా మారినట్టు తెలుస్తోంది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమురం భీం…
ఈ సీటు నాదే… ఆ జడ్పీ నాదేనంటూ…. ఇన్నాళ్ళు గల్లాలెగిరేసిన నేతల గొంతుల్లో ఇప్పుడు పచ్చి వెలక్కాయలు పడ్డాయి. చూస్తో నా తడాఖా అని తొడలు కొట్టిన వాళ్ళకు ఆ వాపు తప్ప ఇంకేం మిగల్లేదట. ఎక్కడుందా పరిస్థితి? ఏ జిల్లాలోని నాయకులు తీవ్ర నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొంతమంది నేతల పరిస్థితి దారుణంగా మారిందట. జడ్పీ ఎన్నికల్లో మాదే పీఠం..నాకే టికెట్ అంటూ ఇన్నాళ్లు ఉవ్విళ్లూరిన వాళ్ళకు మారిన రిజర్వేషన్స్ గట్టి…
ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తారు. అమాయకులు, బలం లేని వాళ్లు ఉంటే ఇక అంతే.. బెదిరించడం లేదా దాడులు చేయడం కామన్ అవుతోంది. పైగా కొంత మంది అధికారుల అండదండలతో కబ్జారాయుళ్లు రెచ్చిపోతున్నారు. కానీ అలాంటి వారికి చెక్ పెడుతున్నారు పోలీసులు. ఇదిగో ఇది ఆదిలాబాద్‌లోని మావల. ఇక్కడ ఓ వ్యక్తి 2011 కొనుగోలు చేసిన 7 ప్లాట్లను ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు మరో రాజకీయ పార్టీ నేత కలిసి 2024లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.…
Orange Travels : ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని అమరావతికి వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు గుడిహత్నూర్ సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. రాత్రి వేళ వంకరగా ఉన్న రహదారిపై బస్సు అదుపు తప్పి…
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో మానవ అక్రమ రవాణా కలకలం రేపుతోంది. ఇటీవల కొమురం భీమ్ జిల్లాలో మానవ అక్రమ రవాణా కేసులో 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో మానవ అక్రమ రవాణా కేసు నమోదైంది. ఓ మైనర్ బాలికను అమ్మేసిన వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. అమ్మాయిని పక్క రాష్ట్రానికి అమ్మిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మానవ అక్రమ రవాణా ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజస్తాన్ కోటా ఏరియాలో ముఠా…
Adilabad: ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో రూ.10 రూపాయలు ఇచ్చి మైనర్ బాలిక పై యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డ ఘటన చోటు చేసుకుంది. షీటీం అవగాహనతో విషయం బయటకు వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేశారు.. నిందితుడు బంగారిగూడకు చెందిన జాదవ్ కృష్ణగా గుర్తించి అరెస్టు చేశారు.
అదిలాబాద్ జిల్లాలో పోలీసులు జాగిలాల కోసం ఓ ఈత కొలను ప్రారంభించారు. జాగిలాలకు వ్యాయామం చేయిస్తూ ఆరోగ్యంగా ఉండేలా వేసవి ఉపశమనంకై ఈత కొలను ప్రారంభించారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. జిల్లాలో 8 జాగిలాలకు ప్రత్యేకంగా ఈత కొలను ఏర్పాటు చేయగా విధులను నిర్వర్తించి ఈత కొలనులో జలకాలాడి సేద తీరనున్నాయి జాగిలాలు. జాగిలాలు వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్నీ కాపాడుకుంటూ ఉన్నప్పుడు విధులయందు ఉత్తమ ప్రదర్శనను అందిస్తాయని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు.…