నిన్నమొన్నటివరకూ చలికాలం చంపేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా చలి పులి పంజా విసిరింది. చలికాలం విశ్రాంతి తీసుకుంది. మళ్ళీ సూరీడు మండిపోతున్నాడు. సెగలు కక్కుతూ.. విరుచుకుపడుతున్నాడు. శివరాత్రి ముగిసిన వెంటనే చలి తగ్గుతుంది కానీ మరీ ఇంత వేడి వుండడం అరుదు అంటున్నారు జనం. వేసవికాలం వచ్చేసిందనడానికి దండి కొడుతున్న ఎండలే నిదర్శనంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలుగా నమోదవుతూ.. జనాలను హడలెత్తిస్తున్నాయి. తెలంగాణలో గురువారం అనేక ప్రాంతాల్లో 42 డిగ్రీల…
నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో మంత్రి హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించనున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు మంత్రులు.బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకోనున్నారు మంత్రులు. ఉదయం 9 గంటలకు బాసరలో శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం ఉదయం 9.20 గంటలకు ముధోల్ లో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేస్తారు మంత్రులు. 12.15 గంటలకు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిటల్ లో రేడియాలజీ ల్యాబ్ నిర్మాణానికి శంఖుస్థాపన చేస్తారు. తరువాత జిల్లా కేంద్రంలో…
తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు కాస్త తగ్గే అవకాశముందని వాతావరణశాఖ సూచించింది. రెండ్రోజులుగా సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మారిన వాతావరణ పరిస్థితులతో రానున్న మూడ్రోజుల పాటు గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతల్లో తగ్గుదల నమోదు అవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బిహార్ నుంచి ఛత్తీస్‌గఢ్, విదర్భల మీదుగా ఉత్తర తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. దీంతో…
తెలంగాణపై చలిపులి పంజా విసురుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పై చలి పెరిగింది. ఆదిలాబాద్ జిల్లా అర్లి టి లో 6.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, బేలాలో 7.8 డిగ్రీలుగా వుంది. చెప్రాలలో 8డిగ్రీలుగా వుంది. నిర్మల్ జిల్లా తానూర్ లో 7.2 డిగ్రీల సెల్షియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు అధికారులు తెలిపారు. పెంబిలో 8.4 గా కనిష్ట ఉష్ణోగ్రత లు నమోదు కావడంతో జనం బయటకు రావడానికే జంకుతున్నారు. ఇటు మంచిర్యాల జిల్లా…
తగ్గినట్టే తగ్గిన చలి.. తెలంగాణలో మళ్లీ పంజా విసురుతోంది.. గత నాలుగైదు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి.. చాలా ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు సగటు కంటే తక్కువగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 6 డిగ్రీల సెల్సియస్ మేర తక్కువగా నమోదు అవుతున్నట్టు వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు.. అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలోనే నమోదు అవుతున్నాయి.. జిల్లాలోని అర్లీ(టీ)లో 4.9 డిగ్రీలుగా నమోదైన ఉష్ణోగ్రతలు.. కుమరంభీంలో 5.8, సిర్పూర్ (యు)లో 5.8,…
21 ఏళ్ళ క్రితం వచ్చిన లగాన్ సినిమా అందరికీ గుర్తుండే వుంటుంది. ఆ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఈ సినిమాను గుర్తుచేశారు ఆదిలాబాద్ అన్నదాతలు. సంక్రాంతి సందర్భంగా పంచెకట్టులో క్రికెట్ ఆడారు అన్నదాతలు. దీంతో ఈలలు, చప్పట్లతో మార్మోగిపోయింది స్టేడియం. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రానికి చెందిన రైతులు క్రికెట్ ఆడారు. బోథ్ లోని లాల్ పిచ్ మైదానంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీల్లో మండల కేంద్రానికి చెందిన రైతులంతా…
అడవుల్లో వేటగాళ్లు రెచ్చిపోతున్నారు. గోళ్లు, చర్మం కోసం పెద్ద పులులను దారుణంగా చంపేస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలో వేటగాళ్ల దుర్మార్గానికి మరో పెద్దపులి బలైంది. మహారాష్ట్రలో వేటగాళ్ల ఉచ్చుకు మరో పెద్దపులి ప్రాణాలు కోల్పోయింది. గడ్చిరోలి జిల్లా అయిరి తాలుకాలోని అటవీ ప్రాంతంలో వేటగాళ్లు అమర్చిన విద్యుత్ వైర్లు తగిలి పెద్దపులి మృతిచెందింది. అనంతరం వేటగాళ్లు పులి కాళ్లు, తల తీసుకుని.. మొండాన్ని అదేచోట పూడ్చిపెట్టారు. డిసెంబర్ 30న అటవీ ప్రాంతంలో తిరుగుతున్న సిబ్బందికి దుర్వాసన రావడంతో పరిశీలించగా..…
గత కొంతకాలంగా తగ్గుతున్న ఉష్ణోగ్రతలు జనానికి ఇబ్బందులు కలిగించాయి. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఏపీ, తెలంగాణ ప్రజలను వణికించిన చలి కాస్త తగ్గుముఖం పట్టింది. రెండు వైపుల నుంచి గాలులు వీస్తున్నా, వాటి ప్రభావం కాస్త తగ్గడంతో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆగ్నేయ దిశ నుంచి గాలులు తక్కువ ఎత్తులో వీచడంతో ఉష్ణోగ్రతలు మళ్లీ గాడిన పడుతున్నాయని, చలి తీవ్రత తగ్గిందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర,…
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్ కు తుడుందెబ్బ పిలుపు నిచ్చింది. ప్రభుత్వం విడుదల చేసిన 317 జీఓ రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది తుడుం దెబ్బ. ఉదయం నుంచే ఆదిలాబాద్ బస్టాండ్ ముందు ఆదివాసి హక్కుల పోరాట సమితి ధర్నా చేయడంతో బస్సులు నిలిచిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో జీఓ నంబర్ 3 ప్రకారం నియమితులైన ఉద్యోగులనే కేటాయించాలని డిమాండ్ చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా తుడుం దెబ్బ నేతలు రోడ్లపైకి వచ్చి బంద్ పాటిస్తున్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగులను 317…
ఆదిలాబాద్‌లో రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఏజెన్సీ ప్రాంతాల్లో రికార్డు స్థాయిల్లో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతాలు గజగజ వణికిపోతున్నాయి. దాదాపు ఏజెన్సీ అన్ని ప్రాంతాల్లో ఉష్ణో గ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోతున్నాయి.దట్టమైన మంచు పొగ మంచు కురుస్తుండటంతో ఏజెన్సీ ప్రాంతాల గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. రోజు వారి కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడుతుంది. ఉదయం పూట పనుల్లోకి వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో…