ఉదయాన్నే ఆ ఊరికి చెందిన కొందరు వ్యక్తులు రోడ్డు పక్కన నిలబడి ఆటోలు ఆపుతుంటారు. ఆటో ఆగిన తరువాత ఆటో డ్రైవర్‌తో మాట్లాడుతారు. ఆ తరువాత అందులోని వ్యక్తులను తీసుకొని వెళ్తారు. ఎవరు వారంతా, ఎందుకు తీసుకెళ్తున్నారు. ఎక్కడికి తీసుకెళ్తారు అనే అనుమానాలు రావొచ్చు. ఆదిలాబాద్ జిల్లాలోని తాంసీ మండలంలో పొన్నారి అనే గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో పత్తిపంట చేతికి వచ్చిన తరువాత పత్తిని తీసేందుకు కూలీల కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదిలాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, మహారాష్ట్రనుంచి ప్రతిరోజూ ఆటోల్లో కూలీలు వస్తుంటారు. వచ్చిన కూలీలను రైతులు మాట్లాడుకొని తీసుకు వెళ్తుంటారు. కిలో పత్తి తీస్తే రూ.8 ఇస్తామని రైతులు చెబుతున్నారు. పత్తి పండిన తరువాత వర్షం కురిస్తే పాడైపోతుంది. దేనికి పనికిరాకుండా పోతుంది. పత్తి పంట పండిన వెంటనే కూలీల కోసం రైతులు ఇలా ఇబ్బందులు పడుతుంటారు.
Read: మెదడుపై కరోనా ప్రభావం… పరిశోధకులు ఏం చెప్తున్నారంటే…