ప్రతి ఫిర్యాదు పై విచారణ చేపడతాం: శశాంక్ గోయల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల గురించి చీఫ్ ఎలక్ర్టోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆదిలాబాద్ 8 పోలింగ్ స్టేషన్లు మొత్తం 937 ఓటర్లు ఉన్నారన్నారు. ఆదిలాబాద్‌లో ఒక్కో స్థానానికి ఇద్దరూ అభ్యర్థులు బరిలో ఉన్నారన్నారు. కరీంనగర్‌లో 8 పోలింగ్ స్టేషన్లు ఉండగా, 1324 ఓటర్లు ఉన్నారు. 2 ఎమ్మెల్సీ స్థానాలకు 10 మంది బరిలో ఉన్నట్టు తెలిపారు. మెదక్ 9 పోలింగ్ స్టేషన్ల పరిధిలో1026 ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. ఒక్కో స్థానానికి ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారన్నారు. నల్గొండలో 8 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 1271 ఓటర్లు ఉన్నారని, ఒక్కో స్థానానికి ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారన్నారు. ఖమ్మం 4 పోలింగ్ స్టేషన్లు ఉండగా, 768 ఓటర్లు ఉన్నారని, ఒక్కో స్థానానికి నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారన్నారు. మొత్తంగా 5,326 ఓటర్లు.. 37 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామని తెలిపారు.
ఓటర్లు కరోనా నియమాలు పాటించాలని, తమ ఓటు హక్కును స్వచ్ఛందoగా వినియోగించుకోవాలని కోరారు. ఏకగ్రీవం అయిన జిల్లాలలో ఎలక్షన్ కోడ్ ఎత్తివేత పై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్టు తెలిపారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ దగ్గర జరిగిన ఘటన పై కలెక్టర్ దగ్గర నివేదిక తెప్పించి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించినట్టు తెలిపారు. ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఓటర్లను ప్రలోభాలుకు గురి చేసే వారిపై, క్యాంప్ రాజకీయాల పై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. అభ్యర్థుల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదుపై విచారణ చేపట్టి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తామని తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!