ఈమధ్య సోషల్ మీడియా వాడకం ద్వారా ఎక్కువగా చాలామంది రాత్రికి రాత్రే స్టార్లుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది సోషల్ మీడియాను విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రీల్స్ ట్రెండ్ సాగుతోంది. ఈ మధ్య చాలామంది 24 గంటలు సోషల్ మీడియా మాయలో పడి రీల్స్ చూస్తూ.. పక్కన ఉన్న ప్రపంచాన్ని మర్చిపోతున్నారు. విపరీతమైన క్రేజ్, అలాగే లక్షల కొద్ది లైక్స్ అంటూ కొందరు వారి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఎలా పడితే అలా వీడియోలను చేయడానికి సాహసాలు చేస్తున్నారు. కొందరైతే వారు చేసే రీల్స్ చూస్తే అసలు ఇలా కూడా చేయవచ్చా అని ఆలోచనలను వాళ్ళు సృష్టిస్తున్నారు. ఇలాంటి రీల్స్ లో కొన్ని మనకు పనికి వచ్చేవి ఉంటే.. మరికొన్ని ఫన్నీ రీల్స్ కూడా ఉంటాయి. అలాగే మరికొన్ని భయంకరంగా కూడా ఉంటాయి. ఇకపోతే తాజాగా ఓ మహిళ రీల్స్ చేయడం చూస్తే భయభ్రాంతులకు లోను చేస్తోంది.
Also read: Basara IIIT Student: బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం.. విద్యార్థి ఆత్మహత్య
ఓ యువతి ఎత్తైన చెట్లను ఎంపిక చేసుకొని ఆ చెట్లపై ఉన్న కొమ్మలపైకి ఎక్కి డాన్స్ చేస్తూ వీడియోలను చేస్తుంది. అయితే ఇక్కడ ఓ మంచి విషయం ఏమిటంటే.. ఆ యువతీ సాంప్రదాయ దుస్తులు ధరించి చెట్టు ఎక్కి బాలన్స్ చేయడమే. ఇక్కడ మరో భయంకరమైన విషయం ఏమిటంటే.. చెట్టు మీద ఎక్కి నిలబడలేని స్థానంలో కూడా ఆ అమ్మాయి డాన్స్ చేయడం. కేవలం ఆ అమ్మాయి ఒక్క వీడియోనే కాకుండా అనేక వీడియోలను వివిధ ప్రాంతాలలో ఎత్తుగా ఉన్న చెట్ల పైకి ఎక్కి చెట్ల కొమ్మలలో మధ్య నిలబడి డాన్స్ చేస్తున్న వీడియోలను నెటిజన్స్ కు ఒకింత బాగానే అనిపించినా.. మరోపక్క ఆ అమ్మాయి ఏదో రోజు ప్రమాదంలో పడుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also read: Seediri Appalaraju : బాబు.. మీ అమోగమైన పాలన ప్రత్యక్షంగా చూశారు
ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోలో చూసి మీ కామెంట్స్ తెలపండి.