బీహార్‌లో ప్రస్తుతం ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. త్వరలోనే ఎన్నికల నోటిఫికేన్ రానుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.
ఓ మహిళ తప్పిపోయిన తన భర్త కోసం ఏడేళ్లుగా ఎదురుచూస్తోంది. ఇంతలో సోషల్ మీడియాలో ఓ రీల్ చూసి షాక్ కు గురైంది. 7 సంవత్సరాల క్రితం తప్పిపోయిన వ్యక్తి కోసం వెతికినా ఆచూకి లభించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఇప్పుడు అదే వ్యక్తి అకస్మాత్తుగా రీల్స్ లో ఓ మహిళతో కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 2018 నుంచి కనిపించకుండా పోయిన…
Instagram reels: కొందరు రీల్స్ పిచ్చి పరాకాష్టకు చేరుకుంటోంది. సోషల్ మీడియాలో వీడియోల వ్యూస్ కోసం పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. కొందరు ఇలాంటి వాటి వల్ల ప్రాణాలు కోల్పోతుంటే, మరికొందరు ఇతరు ప్రాణాలు కోల్పోయేందుకు కారణమవుతున్నారు. తాజాగా, మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో వదిన, మరిది రీల్స్ పిచ్చి ఏకంగా 8 ఫ్లాట్లను దగ్ధం చేసింది. వీరిద్దరు కూడా తీవ్ర గాయాలపాలయ్యారు.
Meta Edits App: ప్రస్తుతం షార్ట్ వీడియోల ట్రెండ్ ప్రపంచాన్ని కుదిపేస్తున్నదనడంలో యువతి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లలో ఈ వీడియోలు ఎక్కువగా చూసే హవా పెరుగుతోంది. ఇన్‌స్టాగ్రామ్ వంటి ఫ్లాట్‌ఫామ్స్‌లో రీల్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఈ పాపులారిటీని మెటా ఈ రంగంలో మరింత ప్రభావాన్ని చూపేందుకు ముందుకు వచ్చింది. ‘ఎడిట్స్’ అనే కొత్త వీడియో ఎడిటింగ్ యాప్‌ను పరిచయం చేసి, బైట్‌డాన్స్ కంపెనీకి చెందిన క్యాప్ కట్‌కు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ…
సోషల్ మీడియాలో వైరల్‌గా మారేందుకు కొందరు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. తరచుగా రీల్స్‌లో ఏదో ఒక వింత లేదా భయానక స్టంట్స్ చేయడం చూస్తునే ఉంటాం. కొన్ని వింతగా మరి కొన్ని నవ్వు తెప్పించేవిగా ఉంటాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఒక అమ్మాయి కుక్క పాలు తాగుతున్నట్లు కనిపిస్తుంది. ఈ వీడియోపై జనాలు రకరకాల కామెంట్లు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఎక్స్‌లోని కొన్ని హ్యాండిల్స్ ఈ వీడియో,…
Kerala: కేరళ రాష్ట్రంలోని కోజికోడ్‌లోని బీచ్ రోడ్‌లో మంగళవారం నాడు 20 ఏళ్ల యువకుడు రెండు లగ్జరీ కార్లను వీడియో తీస్తూ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు వడకరకు చెందిన టికె ఆల్విన్‌గా పోలీసులు గుర్తించారు.
ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్లో ఇద్దరు యువకులు హైవేపై రీల్స్ చేస్తూ వెళ్తున్నారు. ఈ క్రమంలో.. ప్రమాదవశాత్తు వెనుక నుండి వేగంగా వచ్చిన కారు వారిని ఢీకొట్టింది. దీంతో.. యువకులు కొన్ని సెకన్ల పాటు గాల్లోనే ఉండి కిందపడ్డారు. సినిమాలో జరిగే సన్నివేశంలా అనిపించింది. కాగా.. ఈ ఘటనలో యువకులకు తీవ్ర గాయాలయ్యాయి.
రాజస్థాన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో.. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. అంతేకాకుండా.. జలపాతాల వద్ద సందర్శకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. జైపూర్‌కు సమీపంలోని కనోటా డ్యామ్ కూడా నీటి ప్రవాహం భారీగా ప్రవహిస్తోంది. అయితే.. ఆదివారం సెలవు దినం కావడంతో సందర్శకులు ఈ డ్యామ్ చూసేందుకు వచ్చారు. కాగా.. డ్యాం సందర్శనకు వచ్చిన వారిలో ఐదుగురు యువకులు డ్యామ్ నీటిలో కొట్టుకుపోయారు.
గురువారం తెల్లవారుజామున వారణాసిలో ఒకే బైక్‌పై రీల్స్ చేస్తూ వెళ్తున్న ముగ్గురు యువకులు బస్సును ఢీకొట్టారు. దీంతో.. వారు వంద మీటర్ల దూరంలో పడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాద వార్త తెలియగానే మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.