గతవారం ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సంబంధించిన మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం సంబంధించిన పరీక్షా ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. తాడేపల్లి కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్మీడియట్ బోర్డ్ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ మొదటి, రెండవ సంవత్సర ఫలితాలను ఒకేసారి విడుదల చేసింది ఏపీ విద్యాశాఖ. ఇక ఇందులో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలలో 67% ఉత్తీర్ణత సాధించగా.. సెకండ్ ఇయర్ ఫలితాలలో 78% ఉత్తీర్ణత సాధించారు. ఇక ఇప్పుడు పదవ తరగతి పరీక్ష ఫలితాల కోసం రాష్ట్రంలో విద్యార్థులు ఎదురుచూస్తున్నారు.
Also read: Thalaivar 171 : రజినీకి కూతురుగా నటించనున్న ఆ స్టార్ హీరోయిన్..?
ఇక ఇందుకు సంబంధించి ఏప్రిల్ 8వ తారీఖున 10వ తరగతి జవాబుల పత్రాల స్పాట్ వాల్యూషన్ ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. ఇకపోతే అధికారులు ఫలితాల ప్రకటనకు సంబంధించి అధికారులు కొద్దిపాటి కసరత్తులు చేస్తున్నారు. ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు ఎటువంటి గందరగోళానికి లోనవ్వకుండా మరోసారి జవాబు పత్రాలను పున పరిశీలన చేసిన తర్వాత మార్కులను కంప్యూటీరికరణ చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తి అవ్వగానే ఒకటి రెండు రోజుల్లో ఫలితాలను ప్రకటించబోతున్నట్లు అర్థమవుతుంది.
Also read: Indonesia : విరిగిపడిన కొండచరియలు.. 33మంది మృతి, శిథిలాల కింద వందలాది మంది
ఇకపోతే పదవ తరగతి ఫలితాలు ఏప్రిల్ నెల చివరి వారంలో అనగా.. ఏప్రిల్ 25 నుంచి 30 వ తేదీలోపు ఎప్పుడైనా వెల్లడించే అవకాశం ఉంది. ఇందుకుగాను విద్యార్థులు నేరుగా ఎస్ఎస్సి బోర్డు అధికార వెబ్సైట్ https://bse.ap.gov.in/ లో ఫలితాలను చెక్ చేసుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది పదో తరగతి ఫలితాలను మే 6న విడుదల చేయగా ఈసారి మాత్రం కాస్త ముందుగానే ఫలితాలను విడుదల చేయబోతున్నారు. ఇక ఏపీ ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారిక వెబ్సైట్ లో పదవ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు తమ ఫలితాలను చూసుకోవచ్చు.