2023లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత రద్దీగా ఉండే ఎయిర్‌పోర్ట్‌ల్లో టాప్ 10 లిస్టులో ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఒకటిగా నిలిచింది. తాజాగా వెలబడిన ఈ ర్యాంకింగ్స్ లో ఢిల్లీ విమానాశ్రయం టాప్ 10 లో పదవ స్థానాన్ని దక్కించుకుంది. ఇక ఈ జాబితాను పూర్తిగా ఒకసారి చూస్తే.. ఈ జాబితాలో అమెరికా దేశంలోని హార్ట్స్‌ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం మొదటిస్థానం దక్కించుకోగా.. దుబాయ్, డాలస్ విమానాశ్రయాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయని ఎయిర్ పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) వరల్డ్ వెలువడించింది.
Also Read: Singapore PM: ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న లారెన్స్ వాంగ్!
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి 2023 లో ఏకంగా 7.22 కోట్ల మంది ప్రయాణించగా.. ఈ విమానాశ్రయం అంతర్జాతీయంగా 2022 లో 9వ స్థానాన్ని ఆక్రమించిన ఈ ఎయిర్ పోర్ట్.. అయితే 2023 లో మాత్రం 10 స్థానానికి చేరింది. మొదటి స్థానంలోని హార్ట్స్‌ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా 2023 లో 10 కోట్లకి పైగా మంది ప్రయాణించారు. ఇక ఆ తర్వాత రెండో స్థానంలో ఉన్న దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 8.69 కోట్ల మంది ప్రయాణించగా, మూడో స్థానంలో ఉన్న డాలస్ ఫోర్త్ వర్త్ అంతర్జాతీయ విమాన్రాశయం నుండి 8.17 కోట్ల మంది తమ గమ్యస్థానాలను చేరుకున్నారు.
Also Read: Gold Price Today : పరుగులు పెడుతున్న పుత్తడి ధరలు.. అదే దారిలో వెండి.. ఎంతంటే?
ఇకపోతే ప్రపంచంలోనే 10 అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో 5 అమెరికాలోనే ఉండడం విశేషం. దీన్ని బట్టి ప్రపంచంలో ఎంతంది అమెరికాకు వెళ్ళడానికి ఇస్తా పడుతున్నారో ఇట్టే అర్ధంవవుతుంది. 2023లో అంతర్జాతీయంగా ప్రయాణించిన మొత్తం సుమారు 850 కోట్లుగా ప్రయాణికుల సంఖ్య ఉందని ఏసీఐ వెల్లడించింది. 2022 ఏడాదితో పోలిస్తే ఇది 27.2% వృద్ధి కనపడింది.