కామారెడ్డిలో శుక్రవారం కాంగ్రెస్ విజయభేరి యాత్ర – బీసీ డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎవరికి వాళ్లు సీఎం అంటారు ఏంది..? ఇది తప్పు.. హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాయకులు ఎవరికి వారు సీఎం అని చెప్పుకోవడం మానేయండని ఆయన అన్నారు. ముందు గెలిచి రండి.. తర్వాత సోనియాగాంధీ.. రాహుల్ నిర్ణయిస్తారన్నారు వీహెచ్. కామారెడ్డి లో రేవంత్ ని గెలిపించండని, మజా వస్తుందన్నారు వీహెచ్.
Also Read : BY Vijayendra Yediyurappa: కర్ణాటక బీజేపీ కొత్త చీఫ్‌గా యడియూరప్ప కుమారుడు..
మనం అందరం కలిశామని, బలగం లెక్క విజయం సాధిస్తామన్నారు. ప్రజల్లో ఎవరికి క్రేజు ఉందొ.. ఎవరు పార్టీ కోసం పని చేస్తున్నారో అధిష్టానం చూస్తుందన్నారు వీహెచ్. తెలంగాణ ఉద్యమం సమయంలో కోదండరాం కూడా ఎన్నో ఉద్యమాలు చేస్తే క్రెడిట్ కేసీఆర్ తీసుకున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ కోసం మేం కూడా కొట్లాడామన్నారు. తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్, ఆయన కుటుంబం నాంపల్లి దర్గా వద్ద కూర్చొని అల్లాకే నామ్ పే దేదా బాబా… అని అడుక్కునే వారన్నారు. బీసీ డిక్లరేషన్ గురించి మాట్లాడుతూ.. తాము 52 శాతానికి పైగా ఉన్నామని, కాస్త లెక్కతో నిధులు ఇవ్వాలన్నారు.
Also Read : IIT Bombay: “పాలస్తీనా ఉగ్రవాదిని పొగిడిన ప్రొఫెసర్, గెస్ట్ స్పీకర్”.. ఐఐటీ బాంబే విద్యార్థుల ఫిర్యాదు..