హైదరాబాద్ నగరంలోని మంగల్ హాట్ పోలీస్ స్టేషన్ కు బాధితులు క్యూ కట్టారు. 18 సెల్ ఫోన్స్, 9 మంది బంగారం పోయిందంటూ కంప్లైంట్ చేశారు. నిన్న ( బుధవారం ) శ్రీ రామ నవమి సందర్భంగా బీజేపీ గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ నిర్వహించిన ర్యాలీలోనే బంగారం, సెల్ ఫోన్స్ అధికంగా పోయినట్టు బాధితులు ఫిర్యాదులు చేస్తున్నారు. గ్యాంగ్ గా ఏర్పడి డాన్సుల మద్యలో ఒంటిపై బంగారం ఉన్న వారిని టార్గెట్ చేసి మరి దొంగలు కొట్టేశారని తెలిపారు. అలాగే, సివిల్ డ్రెస్ లో ఉన్న పోలీసుల మెడలో ఉన్న చైన్ లను సైతం కొట్టేసేందుకు ముఠా ప్రయత్నం చేసింది. ఇక, డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తున్న మహిళ మెడలో 2 తులాల గోల్డ్ చైన్ ను దొంగిలించినట్లు పేర్కొన్నారు.
Read Also: Pushpa 2: బన్నీ ఆల్ టైం రికార్డ్.. బాలీవుడ్ స్టార్స్ ను సైతం తలదన్ని!
ఇక, సీసీటీవీ కెమెరాల ద్వారా దొంగలను మంగళహాట్ పోలీసులు ఐడెంటిఫై చేస్తున్నారు. మంగుర్ బస్తి యువకులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 18-28 మధ్య వయసున్న చైన్ స్నాచర్స్ ఈ దోపిడికి పాల్పడినట్లు సమాచారం. చైన్ స్నాచింగ్ బెడతాతో నిన్న శ్రీరాముడి శోభ యాత్ర బెంబోలు ఎత్తిపోయింది. డాన్స్ చేయకుండా వ్యక్తుల సెల్ ఫోన్స్, బంగారంపై దృష్టి పెట్టి ఈ దొంగల ముఠా కాజేసింది. తమ దగ్గర నుంచి కొట్టేసిన సెల్ ఫోన్స్, బంగారాన్ని రికవరీ చేసి ఇవ్వాలని బాధితులు వేడుకుంటున్నారు.