అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం ముసలమ్మ దేవాలయంలో నెల రోజుల క్రితం హుండీ చోరీ జరిగింది.. అయితే, అనూహ్యంగా చోరీ సొత్తును నిన్న రాత్రి ఆలయ ఆవరణలో వదిలేసి వెళ్లారు దొంగలు.. ఇక, సదరు దొంగలు పడేసి వెళ్లిపోయిన నగదును వెలికితీసి పోలీసుల సమక్షంలో లెక్కించారు స్థానికులు..
నలుగురు దొంగలు.. నాలుగు నిమిషాలు.. 29 లక్షలు దోపిడి.. అంతా క్షణాల్లో జరిగిపోయింది. హాలీవుడ్ సినిమా తరహాలో దోపిడీ జరిగింది. హైదరాబాద్ శివారు ప్రాంతం రావిరాలలో మరొకసారి ఏటీఎం దోపిడీ చోటుచేసుకుంది. నలుగురు దొంగలు.. నాలుగు నిమిషాలు 29 లక్షల రూపాయల డబ్బును ఎత్తుకొని పోయారు.
కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరులో ఏటీఎం మిషన్‌ను ఎత్తుకెళ్లేందుకు దొంగలు విఫలయత్నం చేశారు. బ్యాంక్ ఆఫ్ బరోడా కు చెందిన ఏటీఎంను పెకిలించిన దుండగులు.. టోయింగ్ వాహనంలో తరలిస్తుండగా.. స్థానిక యువకులు గమనించి అడ్డుకున్నారు. కర్నూలులో సినిమా చూసి చిన్నటేకూరుకు వెళ్లగా ఐచర్ వాహనంలో ఏటీఎం తరలిస్తున్న దృశ్యాలు కనిపించాయి.
Robberies: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బిసి కాలనీలో దొంగలు మంగళవారం (డిసెంబర్ 31) అర్దరాత్రి బీభత్సం సృష్టించారు. జనసంచారం మధ్య జరిగిన ఈ దొంగతనం కలకలం రేపింది. వరుసగా మూడు ఇళ్ళలో చోరీకి పాల్పడిన దుండగులు 25 గ్రాముల బంగారం, 38 వేల రూపాయల నగదు, ఓ మొబైల్ ను అపహరించారు. ఈ సంఘటనతో కాలనీ వాసులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. దొంగతనం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరి కూడా లేకపోవడం దొంగలకు సులభంగా పని…
జనగామ జిల్లాలో దొంగలు హల్చల్ చేశారు. జిల్లా కేంద్రంలోని బీరప్ప గడ్డలో కెమిడి లక్ష్మయ్యకు చెందిన 30 మేకలను గుట్టుచప్పుడు కాకుండా కొట్టం నుండి అర్థరాత్రి గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. పండగ సమయంలో జిల్లాలో మేకల దొంగతనం కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనపై బాధితుడు లక్ష్మయ్య పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు సోదరులు తమ ప్రియురాలి కోసం దొంగలుగా మారారు. తన మేకప్, బట్టలు, ఖరీదైన అభిరుచులను నెరవేర్చడం కోసం దొంగ అవతారమెత్తారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని గ్వాలియర్‌లో చోటు చేసుకుంది. దొంగతనం ఆరోపణలపై ఈ సోదరులను పోలీసులు అరెస్టు చేశారు.
Bike Thieves: సూర్యాపేట జిల్లాలో దొంగలు హల్ చల్ చేశారు. పార్క్ చేసిన వాహనాలనే టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. బైక్ లే లక్ష్యంగా దోపిడీ చేసేందుకు పక్కా ప్లాన్ వేసి వాహనలను మాయం చేస్తున్నారు.
Madhyapradesh : మధ్యప్రదేశ్లోని జబల్‌పూర్‌లోని హినోట్టా గ్రామంలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి తోటలు ఉన్నాయి. రాత్రి చీకటిలో దొంగలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మియాజాకి మామిడిని దొంగిలించడానికి ప్రయత్నించారు.
మధ్యప్రదేశ్లోని షాజాపూర్ జిల్లాలో ఆగ్రా- ముంబై జాతీయ రహదారిపై షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ బైక్ పై వెళ్తున్న ముగ్గురు దొంగలు కదులుతున్న ట్రక్కు నుంచి చోరీ చేశారు.
ఏటీఎం నగదు నింపే వ్యాన్లో 66 లక్షల రూపాయలను దొంగలు ఎత్తుకెళ్లి మర్రిచెట్టులో దాచారు. ఏటీఎంలో నగదు నింపే వ్యాన్లో పట్టపగలే లక్షల రూపాయలు దోచుకెళ్లారు దొంగలు. ఏకంగా రూ. 66 లక్షలను ఎక్కడ దాచాలో తెలియక మర్రిచెట్టు తొర్రలో దాచిపెట్టారు.