Pushpa 2 digital rights sold to Netflix for all time record Price: అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా రిలీజ్ కి ముందే అనేక రికార్డులు నమోదు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. 2021 వ సంవత్సరంలో సుకుమార్ అల్లు అర్జున్ కలిసి చేసిన పుష్ప ది రైజ్ సినిమా అద్భుతమైన హిట్ అయింది. కేవలం తెలుగు వాళ్ళు మాత్రమే కాదు నార్త్ ప్రేక్షకులు కూడా ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఊహించని విధంగా ఈ సినిమాకి వందల కోట్ల కలెక్షన్ వచ్చి పడ్డాయి. ఇక మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో రెండో భాగం మీద అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక్కొక్క రైట్స్ అమ్మకం హాట్ టాపిక్ అవుతుంది. నిజానికి ఈ సినిమాకి సంబంధించిన నార్త్ ఇండియన్ రిలీజ్ రైట్స్ ఏఏ ఫిలిమ్స్ కి చెందిన అనిల్ తడాని సంపాదించారు.
Mahesh Babu: ఆ విషయంలో మహేష్ తోపే.. నిరూపించిన గుంటూరు కారం
దాదాపు 200 కోట్ల రూపాయలు ఇందు కోసం ఆయన వెచ్చించారు. ఇక ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ రైట్స్ కి సంబంధించిన వార్త వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా కోసం నెట్ఫ్లిక్స్ దాదాపుగా 250 కోట్ల రూపాయలు వెచ్చించినట్లుగా తెలుస్తోంది. 250 కోట్లు అనేది బేస్ ప్రైస్ అని సినిమా బాక్సాఫీస్ వద్ద సాధించే కలెక్షన్ ను బట్టి 300 కోట్ల వరకు సినిమా రేట్ పెంచవచ్చని తెలుస్తోంది. ఇప్పటివరకు భారతదేశంలో అత్యధిక డిజిటల్ రైట్స్ సంపాదించిన సినిమాగా ఆర్ఆర్ఆర్ ఉండేది. ఆ సినిమాకి దాదాపు 170 కోట్లు డిజిటల్ రైట్స్ ద్వారా వచ్చాయి. ఇప్పుడు ఆ సినిమాకి దాదాపు రెట్టింపు అమౌంట్ కి ఈ పుష్ప 2 రైట్స్ అమ్ముడుపోవడం ఆల్ టైం రికార్డు. ఇక ఈ దెబ్బతో అల్లు అర్జున్, పుష్ప 2 ఖాతాలలో మరో రికార్డు పడినట్టే.