ఢిల్లీ పేలుడుపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. ఈమేరకు ఆయన ఓ వీడియో ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాక్టర్ ముజమ్మిల్ షకీల్… డాక్టర్ ఆదిల్ అహ్మద్.. డాక్టర్ షాహీన్.. డాక్టర్ మొహియుద్దీన్ సయీద్.. డాక్టర్ మొహమ్మద్ ఉమర్.. ఈ పేర్లన్నీ వింటే, ఇది ఏదో వైద్య బృందం అని మీరు అనుకోవచ్చు.. కానీ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను… వీరు ఆసుపత్రి సిబ్బంది కాదు.. రోగుల ప్రాణాలను కాపాడే వైద్యులు కాదు.…
MLA Raja singh: బీజేపీ పార్టీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కిషన్ రెడ్డి రాజ్యం కిషన్ రెడ్డి రాజ్య అంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ నినాదం చేశారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి ప్రకటన అనంతరం ఎమ్మెల్యే రాజాసింగ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడల్లా లేదా ప్రముఖ నాయకుడు వచ్చినప్పుడల్లా, భవిష్యత్తులో ఒక బీసీ తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతాడని అందరూ అంటారు. తెలంగాణలో చిన్న…
Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంలో రాజకీయ హాట్‌టాపిక్‌గా మారాయి. రాజా సింగ్ కిషన్ రెడ్డిని టార్గెట్‌గా చేస్తూ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. “జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మీరు ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారు? తెలంగాణ, జూబ్లీహిల్స్ ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారని అన్నారు. టిఆర్ఎస్‌ని గెలిపిస్తారా? లేక కాంగ్రెస్‌ని గెలిపిస్తారా? అనే ప్రశ్నలు ప్రజల నుండి సోషల్ మీడియాలో వచ్చాయని ఆయన అన్నారు. మొబైల్ లవర్స్కి…
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మార్వాడీలపై జరుగుతున్న ఆరోపణలకు స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. “మార్వడి గో బ్యాక్ అనేది అర్బన్ నక్సలైట్ల కుట్ర మాత్రమే” అని ఆయన పేర్కొన్నారు. రాజాసింగ్ మాట్లాడుతూ, గతంలో కోమటీలపై కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగాయని గుర్తుచేశారు.
Goshamahal MLA Raja Singh warns newcomers to BJP: బీజేపీలో చేరుతున్న వారికి గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ హెచ్చరికలు జారీ చేశారు. బీజేపీ పార్టీలో చేరుతున్న వారికి స్వాగతం-సుస్వాగతం.. పార్టీలో చేరే ముందు కొన్ని మాటలు యాది పెట్టుకోండి, మరికొన్ని రాసి కూడా పెట్టుకోండి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పార్టీలో చేరిన తర్వాత మీరు కోరుకున్నది మీ అసెంబ్లీ, మీ జిల్లా, మీ పార్లమెంటరీ నియోజకవర్గంలో జరగదు అని చెప్పారు. మీపైన…
Rajasingh : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీసీ రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఢిల్లీలో బీసీల కోసం నిర్వహిస్తున్న ధర్నాకు కాంగ్రెస్‌కు ధన్యవాదాలు తెలుపుతూ, అయితే బీసీ కోటాలో ముస్లింలకు రిజర్వేషన్లు ఎందుకు ఇస్తున్నారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. “42 శాతం బీసీ రిజర్వేషన్లలో 10 శాతం ముస్లింలకు ఎందుకు ఇస్తున్నారు? ముస్లింలు బీసీలా? బీసీల రిజర్వేషన్ల సాధన కోసం డిల్లీకి వెళ్లారా, లేక ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడానికే వెళ్లారా? దీనిపై సీఎం రేవంత్…
తనను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్‌కౌంటర్ చేయాలని ప్లాన్ చేసినట్లు ఎమ్మెల్యే రాజాసింగ్ వెల్లడించారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. నాడు జరిగిన సంచలన విషయాలను వివరించారు. తాను హిందు వాహినిలో చేరి యువతను ధర్మం వైపునకు వచ్చేలా చర్యలు కార్యక్రమాలు చేపట్టానని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో తమ కార్యక్రమాలకు ఎప్పుడూ ఏదో ఒక గొడవ సృష్టించేవారని, తాము ఎక్కడికి వెళితే అక్కడ 144 సెక్షన్ అమలు చేసేవారని రాజాసింగ్ తెలిపారు.
Raja Singh Says I have been the MLA of Goshamahal for three years: గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను బీజేపీ ఎమ్మెల్యే అని చెప్పొచ్చని, గోషామహల్‌కు మూడేళ్లు తానే ఎమ్మెల్యే అని పేర్కొన్నారు. కొన్ని తాను తప్పులు చేశానని, సోషల్ మీడియా మరికొన్ని తప్పుడు ప్రచారం చేసిందన్నారు. తమ పార్టీలో మిత్రులు, శత్రువులు ఉంటారని చెప్పారు. మీడియాకు రాజా సింగ్ లీక్‌లు ఇస్తున్నారని మా వాళ్లే…
నలుగురు….. ఎస్, ఆ నలుగురు నాయకులు. ధిక్కార స్వరాలను ఓ రేంజ్లో వినిపిస్తున్నారు. ఆ సౌండ్‌తో వాళ్ళున్న పార్టీలకు సైతం గూబ గుయ్‌మంటోంది. తమ హాట్ హాట్ కామెంట్స్‌తో, చేతలతో తెలంగాణ సమాజం మొత్తాన్ని తమవైపు తిప్పుకుంటున్నారు. అధిష్టానాలకు కంట్లో నలుసులా, నిత్య తలనొప్పిగా మారిన ఆ ప్రజా ప్రతినిధులు ఎవరు? ఏంటి వాళ్ళ కథా, కమామీషు? సొంత పార్టీ అగ్రనేతల్నే టార్గెట్ చేస్తాడు. కేంద్ర మంత్రి అయినా…, రాష్ట్ర అధ్యక్షుడు అయినా.. ఆ నోటికి ఒక్కటే.…