బంగారం స్మగ్లింగ్ కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. డీఆర్ఐ అధికారులు దూకుడుగా వ్యవహరిస్తు్న్నారు. ఈ కేసులో అరెస్టైన నటి రన్యారావు దగ్గర నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. ఆ దిశగా దర్యాప్తు ముందుకు సాగుతోంది. ఇటీవల ఆమె స్నేహితుడు తరుణ్ రాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇతడితో రన్యారావు సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించి అరెస్ట్ చేశారు.
తాజాగా రన్యారావు భర్త జతిన్ హుక్కేరిపై కూడా అధికారులు దృష్టి పెట్టారు. స్మగ్లింగ్‌లో ఇతడి ప్రమేయం కూడా ఉన్నట్లుగా గుర్తించారు. జతిన్ హుక్కేరి ప్రముఖ ఆర్కిటెక్ట్. పబ్‌లు, లాంజ్‌లను డిజైన్ చేయడంలో ప్రసిద్ధి చెందిన వ్యక్తి. అయితే భార్య రన్యారావు బంగారం స్మగ్లింగ్‌లో జతిన్ హుక్కేరి పాత్ర కూడా ఉన్నట్లుగా ఆధారాలు సేకరించారు. అతడి ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Pradeep : ఆ యంగ్ హీరో నెక్ట్స్ టార్గెట్ రూ. 200 కోట్లు
జతిన్ హుక్కేరి.. బెంగళూరులోని ఆర్వీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పూర్వ విద్యార్థి. లండన్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్‌లో డిస్రప్టివ్ మార్కెట్ ఇన్నోవేషన్‌లో ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌ను అభ్యసించాడు. అంతక ముందే ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్‌లో ప్రత్యేకతను సాధించాడు. అయితే అతడి వ్యాపార కార్యకలాపాలకు.. ఈ స్మగ్లింగ్ కేసుకు సంబంధం ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఇతడికి అనేక మంది రాజకీయ ప్రముఖలతో పరిచయాలు ఉన్నట్లుగా కనుగొన్నారు. ఈ నేపథ్యంలోనే రన్యారావు.. ఈజీగా బంగారం స్మగ్లింగ్ చేయగలిగినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ దిశగానే డీఆర్ఐ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇదిలా ఉంటే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అరెస్టు చేసే అవకాశం ఉందన్న నేపథ్యంలో జతిన్ హుక్కేరి.. మంగళవారం హైకోర్టును ఆశ్రయించగా ఉపశమనం కల్పించింది.
ఇది కూడా చదవండి: Producers : ఇద్దరు నిర్మాతలు పోటాపోటిగా స్టేట్మెంట్స్.. గెలుపెవరిదో
మార్చి 3న బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో బంగారం స్మగ్లింగ్ చేస్తూ రన్యారావు పట్టుబడింది. ఆమె దగ్గర నుంచి రూ.12 కోట్లకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆమె ఇంటి దగ్గర కూడా రూ.3కోట్ల ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈమె వెనుక రాజకీయ శక్తులు ఉన్నట్లుగా డీఆర్ఐ అధికారులు భావిస్తున్నారు. దర్యాప్తు కొనసాగే కొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక రన్యారావు తండ్రి ఐపీఎస్ ఆఫీసర్‌గా ఉన్నారు. ఈ పలుకుబడి ఉపయోగించుకుని రన్యారావు.. వీఐపీ ప్రొటోకాల్‌లో బయటకు వచ్చేసినట్లుగా గుర్తించారు. ఇక దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Mahesh Kumar Goud: స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడానికి కారణం అదే..