Devi Sri Prasad : దేవి శ్రీ ప్రసాద్ మద్యం తాగడంపై ఆసక్తికర కామెంట్లు చేశారు. ఇప్పుడు వరుస హిట్లతో జోరు మీదున్నాడు. పుష్ప-2 పెద్ద హిట్ కావడంతో దేవి పేరు నేషనల్ లెవల్ లో వినిపిస్తోంది. దానికి తోడు మొన్న వచ్చిన తండేల్ మూవీ మ్యూజికల్ గా చాలా పెద్ద హిట్ అయింది. దీంతో దేవి శ్రీ ప్రసాద్ ఈజ్ బ్యాక్ అంటూ ఆయన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇలాంటి టైమ్ లో ఆయన ఓ పాడ్ కాస్ట్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నాడు. ఇందులో దేవి మాట్లాడుతూ మద్యం అలవాటుపై స్పందించాడు. “నాకు మద్యం తాగే అలవాటు అస్సలు లేదు. కనీసం స్మోక్ కూడా చేయను. నేను వాటికి దూరంగానే ఉంటాను” అన్నాడు.
Read Also : Poonam Bhajwa : అందాలకు రంగులు పూసేసిన పూనమ్ భజ్వా
“నా ఈవెంట్లో కూడా మద్యం ఉండదు. నేను షో చేస్తే అక్కడ మందు ఉండదు. ఫుడ్ మాత్రం అన్ని రకాలుగా ఉంచుతాను. కెరీర్ కోసం నేను మద్యానికి దూరంగానే ఉంటున్నాను. అది నా సిద్ధాంతం. నా ప్రిన్సిపుల్స్ నేను బలంగా పాటిస్తాను. వేరే వాళ్లను మద్యం తాగొద్దని నేను చెప్పను. ఎవరి ఇష్టం వాళ్లది. కానీ నాకు మాత్రం మద్యం అస్సలు నచ్చదు. ఇప్పటి వరకు ఒక్క చుక్క కూడా తాగలేదు. నా దృష్టిలో అదొక వ్యసనం. దానికి అలవాటు పడి కెరీర్ నాశనం చేసుకున్న వారిని ఎంతో మందిని చూశాను” అంటూ చెప్పుకొచ్చాడు దేవి. ప్రస్తుతం దేవి చేతిలో ఎనిమిది సినిమాల దాకా ఉన్నాయి.