బంగారం ధర ఆకాశాన్నంటుతోంది. లక్ష రూపాయలకు మించిపోయి చుక్కలు చూపిస్తోంది. దీంతో విదేశాల్లో తక్కువ ధరకు దొరికే బంగారాన్ని అక్రమంగా తీసుకు వచ్చి తెలుగు రాష్ట్రాల్లో విక్రయించేందుకు కొంత మంది కేటుగాళ్లు ప్లాన్ చేశారు. కానీ ఎయిర్ పోర్టులో దిగీదిగగానే.. DRI అధికారులను చూసి బంగారాన్ని వదిలేసి వెళ్లారు. తర్వాత ఆయా వ్యక్తులను DRI అధికారులు అరెస్ట్ చేశారు. నిత్యం ధర పెరుగుతున్న పసిడి ఇప్పుడు లాభసాటి వ్యాపారం. అంతర్జాతీయంగా ధరలు పెరిగినా సరే.. సౌదీ అరేబియా,…
బంగారం అక్రమ రవాణా కేసులో నిందితురాలిగా ఉన్న కన్నడ నటి రన్యా రావుకు మరో షాక్ తగిలింది. ఆమె బెయిల్ పిటిషన్‌ను బెంగళూరులోని సెషన్స్ కోర్టు తిరస్కరించింది.
బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఈనెల 3న బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ కన్నడ నటి రన్యారావు కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డీఆర్ఐ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా రూ.12 కోట్లకుపైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమె ఇంట్లో సోదాలు చేయగా రూ.3 కోట్ల విలువైన ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు.
కన్నడ నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా రన్యారావుతో తెలుగు నటుడు తరుణ్ రాజుకు ఉన్న సంబంధాల గురించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తరుణ్ రాజ్ బెయిల్ పిటిషన్ సందర్భంగా ఇరువర్గాల వాదనల్లో కొత్త విషయాలు బయటకొచ్చాయి.
కన్నడ నటి రన్యా రావు బంగారు స్మగ్లింగ్ కేసు దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటికొచ్చాయి. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) తాజా వివరాలను వెల్లడించింది. మంగళవారం కోర్టు విచారణ సందర్భంగా రన్యా రావు, ఆమె స్నేహితుడు తరుణ్ రాజు దుబాయ్‌కు 26 ట్రిప్పులు చేసి వారు బంగారాన్ని అక్రమంగా రవాణా చేసినట్లు ఆధారాలు ఉన్నాయని డీఆర్ఐ కోర్టుకు తెలిపింది.
బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యా రావు భర్త జతిన్ హుక్కేరి అరెస్టు నుండి మినహాయింపు కోరాడు. ఈ మేరకు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో అతనికి కర్ణాటక హైకోర్టు గత మంగళవారం ఉపశమనం ఇచ్చింది. హైకోర్టు తదుపరి విచారణ జరిగే వరకు జతిన్ పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.
బంగారం స్మగ్లింగ్ కేసులో నిందితురాలైన నటి రన్యారావు ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ వేసింది. ఈ సందర్భంగా మంగళవారం రన్యారావు తరపున న్యాయవాది కిరణ్ జవాలి వాదనలు వినిపించారు. మార్చి 3న అరెస్టైన దగ్గర నుంచి రన్యారావును డీఆర్ఐ అధికారులు మానసికంగా వేధించారని.. ఆమెకు నిద్రలేకుండా చేశారని తెలిపారు.
బంగారం స్మగ్లింగ్ కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. డీఆర్ఐ అధికారులు దూకుడుగా వ్యవహరిస్తు్న్నారు. ఈ కేసులో అరెస్టైన నటి రన్యారావు దగ్గర నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. ఆ దిశగా దర్యాప్తు ముందుకు సాగుతోంది. ఇటీవల ఆమె స్నేహితుడు తరుణ్ రాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇతడితో రన్యారావు సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించి అరెస్ట్ చేశారు.
గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో సంచలనంగా మారిన విషయం ఏదైనా ఉందంటే అది నటి రన్యారావ్ బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోవడమే. ఈమె వ్యవహారం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. గోల్డ్ స్మగ్లింగ్ కు పాల్పడుతున్న రన్యారావును డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటుంది. తాజాగా మరో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. రన్యారావుపై డీఆర్ఐ అధికారులకు ఫిర్యాదు చేసింది ఆమె భర్తేనని తెలిసింది. పెళ్లైన రెండు నెలల…
బంగారం స్మగ్లింగ్ కేసులో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రధాన నిందితురాలు, నటి రన్యారావు స్నేహితుడు, అట్రియా హోటల్ యజమాని మనవడు తరుణ్ రాజును బెంగళూరులో డీఆర్ఐ అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు. తరుణ్ రాజును కోర్టులో హాజరుపరచగా ఐదు రోజులు డీఆర్ఐ కస్టడీకి అప్పగించింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు.. తరుణ్ రాజును విచారిస్తు్న్నారు.