Virat Kohli : విరాట్ కోహ్లీ సెన్సేషనల్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఒక్క మ్యాచ్ కోసం తన రిటైర్మెంట్ ను వెనక్కు తీసుకుంటానంటూ ప్రకటించేశాడు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆ ఫార్మాట్ కు విరాట్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తన రిటైర్మెంట్ మీద యూటర్న్ తీసుకున్నాడు విరాట్. దానికి కారణం ఒలంపిక్స్. 2028లో లాస్ ఏంజెల్స్ లో జరిగే ఒలంపిక్స్ లో క్రికెట్ ను చేర్చనున్నారు. ఇన్నోవేషన్ ల్యాబ్ ఇండియన్ స్పోర్ట్స్ సమ్మిట్ లో విరాట్ కోహ్లీ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశాడు.
Read Also : పూనమ్.. రంగు రంగుల అందాలు
ఒకవేళ ఒలంపిక్స్ లో ఇండియా ఫైనల్ కు చేరుకుంటే ఆ ఒక్క మ్యాచ్ కోసం తాను రిటైర్మెంట్ ను వెనక్కు తీసుకుంటానేమో అంటూ స్టేట్ మెంట్ ఇచ్చాడు. అలాగే తన ఫిట్ నెస్ మీద కూడా స్పందించాడు. ఆట అద్భుతంగా ఆడటం కోసం ఫిట్ నెస్ చాలా ముఖ్యం అన్నాడు. ఫిట్ నెస్ కోసం తాను నిరంతరం విద్యార్థిలాగా నేర్చుకుంటానని చెప్పుకొచ్చాడు. ఇక విరాట్ గనక ఒలంపిక్స్ లో ఆడితే కచ్చితంగా కప్ మనదే అంటూ ఆయన ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.