School Kids Car Driving: ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి. అయితే, కంటెంట్ అనుసరించి కొన్ని వైరల్ అవుతుండడం మనం గమనిస్తూనే ఉంటాం. ఇదివరకు సోషల్ మీడియాలో అనేక మార్లు ట్రాఫిక్ ఉల్లంఘనకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అయ్యాయి. రోడ్లపై ఇష్టానుసారం వెళ్లడం, రోడ్డుపై వెళ్తున్న సమయంలో ప్రేమికులు రెచ్చిపతూ వెళ్లడం లాంటి ఘటనలు సంబంధించిన అనేక వీడియోలు మనం చూసాం. ఇకపోతే, తాజాగా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో కొందరు విద్యార్థులు స్కూలుకి మహేంద్ర XUV700 కారులో వెళ్లడం గమనించవచ్చు.
Read Also: Kim Kardashian: “అంబానీలు” ఎవరో తెలియకున్నా పెళ్లికి వచ్చాం.. కిమ్ కర్దాషియాన్ కామెంట్స్..
పిల్లలు స్కూల్కు రావడం పెద్ద విషయం ఏమి కాదని భావించవచ్చు.. కానీ, అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. మామూలుగా స్కూల్ చదువుకున్న వారికి ఇంట్లో పెద్దలు డ్రైవ్ చేసుకుంటూ వచ్చి వారిని స్కూలు దగ్గర వదిలి వెళ్లడం మనం చూస్తూ ఉంటాం. కానీ, తాజాగా వైరల్ అయిన వీడియోలో స్కూల్ విద్యార్థి నేరుగా రద్దీగా ఉన్న రోడ్డుపై వాహనం నడుపుతూ స్కూల్ దగ్గరకు చేరుకున్నాడు. ఆ కారులో కేవలం ఆ విద్యార్థి మాత్రమే కాకుండా మరో నలుగురు విద్యార్థులు కూడా ఉండడం గమనించవచ్చు. వీరందరూ 13 లేదా 14 ఏడాది వయసున్న పిల్లలే. ఈ ఘటన మహారాష్ట్రలోని థానేలో చోటుచేసుకుంది. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా నెటిజెన్స్ విద్యార్థుల తల్లిదండ్రులపై మండిపడుతున్నారు.
Read Also: Garlic Health Benefits: వెల్లులి నిజంగానే వ్యాధులను నయం చేస్తుందా? నిజమెంత!
విద్యార్థుల తల్లిదండ్రులకు కాస్తయినా బుద్ధి ఉందా.? వారిని పెంచడం చేతకాదా అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. మరికొందరైతే ఆ విద్యార్థుల తల్లిదండ్రులను పోలీసులు కచ్చితంగా కఠినంగా శిక్షించాలని కామెంట్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోనే ఒకసారి చూసి నీకేమనిపిస్తుందో ఓ కామెంట్ చేయండి.